Mattress Buying Tips: పరుపు కొనే ముందు వీటిని తప్పక పరిశీలించండి.. లేదంటే ఆరోగ్య సమస్యలొస్తాయ్..!

Mattress Buying Tips: మంచి, సరైన పరుపును ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మంచి పరుపు/మ్యాట్రెస్ మన నిద్ర, ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒక చెడ్డ పరుపు వెన్ను, మెడలో నొప్పిని కలిగిస్తుంది. సరైన నిద్రను నిరోధిస్తుంది. మనం సరైన పరుపును ఎంచుకోకపోతే, అది మన శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

Mattress Buying Tips: పరుపు కొనే ముందు వీటిని తప్పక పరిశీలించండి.. లేదంటే ఆరోగ్య సమస్యలొస్తాయ్..!
Mattress Buying Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 09, 2023 | 7:18 PM

Mattress Buying Tips: మంచి, సరైన పరుపును ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మంచి పరుపు/మ్యాట్రెస్ మన నిద్ర, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సరికాని పరుపు మన వెన్ను, మెడ సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. సరైన నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే సరైన పరుపును ఎంచుకోకపోతే, అది మన శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. సాధారణంగా మనం ఎక్కువ సమయం పడకపైనే గడుపుతాము. అందుకే మంచి, సౌకర్యవంతమైన మ్యాట్రెస్ తప్పనిసరిగా అవసరం. ఈ కారణంగా ఎవరైనా మ్యాట్రెస్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి. తద్వారా మీరు సరైన మ్యాట్రెస్ కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.

పరుపు సౌకర్యంగా ఉండాలి..

పరుపు కొనే సమయంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పరుపు సౌకర్యంగా ఉంటుందా? ఉండదా? అనేది చూసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు మన శరీరానికి సౌకర్యవంతంగా ఉండాలి. ఒకవేళ మ్యాట్రెస్ సరిగా లేకపోతే వెన్ను, నడుము, మెడ భాగంలో నొప్పి రావచ్చు. అందుకే.. మ్యాట్రెస్ మందం, మృదుత్వం, ఆకారం పూర్తిగా శరీరానికి సపోర్ట్‌ ఇచ్చే విధంగా ఉండాలి. పరుపు లోపల ఏర్పాటు చేసే పదార్థం కూడా చాలా ముఖ్యం. ఫోమ్, రబ్బరు వంటి ఎలాంటి పదార్థాలు ఏర్పాటు చేశారనేది గమనించాలి. అందకే ఒక మ్యాట్రెస్ కొనుగోలు చేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

మందపాటి లేదా సన్నని పరుపును ఎలా ఎంచుకోవాలి?

మ్యాటెస్ కొనుగోలు చేసేటప్పుడు మరో అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సన్నని పరుపు కొనాలా? మందపాటి పరుపు కొనాలా? అనేది మీ సౌకర్యాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. మ్యాట్రెస్ మందం ఎంపిక అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సన్నని పరుపులు సాధారణంగా 4 నుండి 5 అంగుళాల మందంగా ఉంటాయి. ఇవి తక్కువ బరువు ఉన్నవారికి సరిపోతాయి. శరీర ఒత్తిడికి అనుగుణంగా సన్నని పరుపులు వినియోగించొచ్చు. కానీ ఇవి వెన్ను ఆరోగ్యానికి తగిన సహకారం అందించవు. మరోవైపు, మందపాటి పరుపులు 7 నుండి 8 అంగుళాల మందంతో ఉంటాయి. బరువైన వ్యక్తులకు అనుకూలంగా ఉంటాయి. ఇది వెన్ను, మెడకు మంచి సపోర్ట్‌ను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మ్యాట్రెస్ లోపల ఉన్నది ఏంటో తెలుసుకోండి..

మ్యాట్రెస్ ఫాబ్రిక్ దాని నాణ్యత, సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. పాలీఫోమ్, లేటెక్స్ ఫోమ్, మెమరీ ఫోమ్, ఫెదర్ వంటి ఫ్యాబ్రిక్‌లను ప్రధానంగా పరుపులలో ఉపయోగిస్తారు. పాలీఫోమ్ చౌకైన ఎంపిక, కానీ మృదువైనది కాదు. లాటెక్స్ ఫోమ్ మృదువైనది. శరీర ఆకృతికి తగ్గట్లుగా ఉంటుంది. మరికొన్ని పరుపులు మంచి వెంటిలేషన్‌ను అందిస్తుంది. శరీరానికి సపోర్ట్ ఇస్తుంది. శరీర ఆకృతిని బట్టి మెమరీ ఫోమ్ సరిపోతుంది. ఈ విధంగా, మీరు మీ అవసరాలు, బడ్జెట్ ప్రకారం మ్యాట్రెస్‌ను ఎంచుకోవాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈలింక్ క్లిక్ చేయండి..