Dog Crying: ఇంటి గుమ్మం ముందు కుక్క ఏడిస్తే దేనికి సంకేతం.. తప్పక తెలుసుకోండి..
Dog Crying: మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం.. వీధుల్లో కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తుంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటుంటారు. ఇంటి ముందు గానీ, వీధిలో గానీ కుక్కలు ఏడుస్తున్నట్లుగా అరిస్తే.. వాటిని అదిలించే ప్రయత్నం చేస్తుంటారు. కుక్క అలా అరవడం అపశకునం అని, చెడుకు సంకేతం అని మత విశ్వాసం.
Dog Crying: మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం.. వీధుల్లో కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తుంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటుంటారు. ఇంటి ముందు గానీ, వీధిలో గానీ కుక్కలు ఏడుస్తున్నట్లుగా అరిస్తే.. వాటిని అదిలించే ప్రయత్నం చేస్తుంటారు. కుక్క అలా అరవడం అపశకునం అని, చెడుకు సంకేతం అని మత విశ్వాసం. అయితే, వాస్తవానికి కుక్క ఏడుపు ఏం సూచిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏదైనా విపత్తు లేదా సంఘటన జరగడానికి ముందే కుక్కకు సిగ్నల్స్ అందుతాయట. అందుకే కుక్క ఏడుస్తుందంటే ఏదో విపత్తు రాబోతుందని నమ్ముతారు. కుక్క అరవడం రాబోయే విపత్తును సూచిస్తుందని, ఎప్పుడైనా ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే, ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతోందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు పెద్దలు.
కుక్క ఏడుపు దేనిని సూచిస్తుంది?
➥ మీ ఇంటి బయట లేదా తలుపు వద్ద కుక్క మొరిగితే. ఇది ఏదో ఒక వ్యాధిని సూచిస్తుంది. మీ కుటుంబంలో ఎవరైనా పెద్ద అనారోగ్యంతో బాధపడవచ్చు.
➥ ఒక కుక్క రాత్రి ఏడుస్తుంటే, అది కొన్ని పెద్ద దురదృష్టాలను సూచిస్తుంది. అందుకే కుక్కను ఇంటి బయట ఏడవనివ్వకూడదు.
➥ కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. దీని వల్ల మీరు నష్టపోవాల్సి రావచ్చు.
➥ ఏదైనా ఇంటి బయట కుక్క ఏడుస్తుంటే కొన్ని చెడ్డ వార్తలు వినే ఛాన్స్ ఉంది.
➥ మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తి ఉన్నట్లయితే.. కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి.
రాహు, కేతువులకు కారకుడు కుక్క. అందుకే కుక్క ఏడుపు రాహు, కేతువుల అశుభాన్ని సూచిస్తుంది. అందుకే కుక్క ఏడవడం శ్రేయస్కరం కాదు. మీ ఇంటి బయట కుక్క ఎప్పుడైనా ఏడుస్తుంటే, ఈ చిన్న పరిష్కారాన్ని ప్రయత్నించండి. ఏదైనా సమస్య నివారించబడుతుంది. లేదా తగ్గించబడుతుంది.
కుక్క ఇంటి బయట ఏడుస్తుంటే ఈ చర్యలు చేయండి
➥ కుక్కలను ఇంటి బయట ఏడుస్తున్నట్లయితే.. తరిమేయండి.
➥ కుక్క ఏడ్చినప్పుడు, శివుడిని పూజించండి లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి.
➥ అవసరమైన వ్యక్తికి దానం చేయండి.
➥ ఎవరికీ చెడు చేయవద్దు, ఎవరి గురించి చెడు ఆలోచనలు మీ మనస్సులో తీసుకురావద్దు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆసక్తులను ధృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..