Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father for Sale: తండ్రి మీద కోపంతో ఈ గడుగ్గాయి ఏం చేసిందో చూడండి.. స్వీట్ రివెంజ్‌

పిల్లల ఆకతాయి పనులతో ఒక్కోసారి పెద్దలకు చిర్రెత్తిస్తుంటారు. దీంతో పెద్దలు పిల్లలను కసురుకుంటుంటారు. ఆనక వాళ్లు అలిగి చేసే అల్లరి అంతా ఇంతా ఉండదు. తమ అలక తీరేంత వరకూ రకరకాల రివెంట్‌లు ప్లాన్‌ చేస్తుంటారు. సాధారణంగా చిన్నపిల్లలకు పేరెంట్స్ మీద కోపం వస్తే ఇలాగే చేస్తుంటారు. అలాగే ఓ తండ్రీ కూతుళ్లకు కూడా విభేదాలు వచ్చాయి. దీంతో సదరు గడుగ్గాయి రివెంజ్‌ ప్లాన్‌ ఒకటి వేసి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. తండ్రి తనను మందలించాడని అలిగిన..

Father for Sale: తండ్రి మీద కోపంతో ఈ గడుగ్గాయి ఏం చేసిందో చూడండి.. స్వీట్ రివెంజ్‌
Father On Sale For Rs 2 Lakh Notice
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 09, 2023 | 5:29 PM

పిల్లల ఆకతాయి పనులతో ఒక్కోసారి పెద్దలకు చిర్రెత్తిస్తుంటారు. దీంతో పెద్దలు పిల్లలను కసురుకుంటుంటారు. ఆనక వాళ్లు అలిగి చేసే అల్లరి అంతా ఇంతా ఉండదు. తమ అలక తీరేంత వరకూ రకరకాల రివెంట్‌లు ప్లాన్‌ చేస్తుంటారు. సాధారణంగా చిన్నపిల్లలకు పేరెంట్స్ మీద కోపం వస్తే ఇలాగే చేస్తుంటారు. అలాగే ఓ తండ్రీ కూతుళ్లకు కూడా విభేదాలు వచ్చాయి. దీంతో సదరు గడుగ్గాయి రివెంజ్‌ ప్లాన్‌ ఒకటి వేసి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. తండ్రి తనను మందలించాడని అలిగిన కూతురు ఏకంగా తండ్రిని ఎలాగైనా అమ్మేయాలనుకుంది. అంతే ‘మా నాన్నను రూ.2 లక్షలకు ఎవరైనా కొనుక్కోండి’ అంటూ నోటిస్‌ పెట్టింది. ఈ ఫన్నీ ప్రకటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

ఆ తండ్రీకూతురికి మధ్య వేభేదాలొచ్చాయి. దీంతో అలిగిన కూతురు ‘ఫాదర్ ఫర్ సేల్, రూ.2 లక్షలు, ఇంకేమైనా కావాలంటే బెల్ కొట్టండి…’ అంటూ తమ ఇంటి కిటికీ కడ్డీల మధ్య కూతురు నోటీసు పెట్టింది. అది చూడగానే నవ్వుకున్న తండ్రి దానిని ఫొటో తీసి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. నా ఎనిమిదేళ్ల కుమార్తె తన చేతిరాతతో నోటీసును సిద్ధం చేసింది. మా ఇద్దరికీ కొంచెం అభిప్రాయ భేదం వచ్చింది. దీంతో నా కూతురు తలుపు గుమ్మం మీద ఫాదర్ ఫర్‌ సేల్ అంటూ నన్ను అమ్మకానికి పెట్టింది. నా విలువ కేవలం రూ. 2 లక్షలేనా.. నాకు తగినంత ధర కట్టలేదంటూ’ చిన్నారి తండ్రి ఈ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పలువురు నెటిజన్లు ఫన్నీగా ఈ పోస్ట్‌కి కామెంట్లు పెడుతున్నారు. పిల్లలు తెలియక చేసే చిలిపి పనులు ఒక్కోసారి కడుపుబ్బ నవ్విస్తుంటాయి. తండ్రితో గొడవ పడితే ఇలా కూడా స్వీట్ రివెంజ్ తీర్చుకోవచ్చని ఈ ఫన్నీ పోస్టు చూస్తే అర్ధమవుతోందంటూ పలువురు కామెంట్‌ సెక్షన్‌లో రాసుకొచ్చారు. ఇంతకీ మీ పిల్లలు ఎవరైనా ఇలా చేశారా..

మరిన్ని వైరల్‌ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.