ప్రియుడితో గొడవ.. 300 అడుగుల ఎత్తైన పర్వతంపై నుంచి దూకిన యువతి! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బీహార్‌లోని నలందలో 300 అడుగుల ఎత్తైన హిరణ్య పర్వతం నుంచి ఓ యువతి అమాంతం దూకేసింది. ప్రియుడితో గొడవపడిన సదరు యువతి ఆత్మహత్య చేసుకునేందుకు కొండపై నుంచి దూకినట్లు తెలుస్తోంది. అయితే అలా దూకిన యువతి అనుకోనిరీతిలో పర్వతం పొదల్లో చిక్కుకుపోయింది. దీంతో ప్రాణభయంతో కాపాడాలంటూ యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆరుగురు వ్యక్తులు శ్రమపడి పొదల్లో నుంచి యువతిని బయటికి..
నలంద, అక్టోబర్ 10: బీహార్‌లోని నలందలో 300 అడుగుల ఎత్తైన హిరణ్య పర్వతం నుంచి ఓ యువతి అమాంతం దూకేసింది. ప్రియుడితో గొడవపడిన సదరు యువతి ఆత్మహత్య చేసుకునేందుకు కొండపై నుంచి దూకినట్లు తెలుస్తోంది. అయితే అలా దూకిన యువతి అనుకోనిరీతిలో పర్వతం పొదల్లో చిక్కుకుపోయింది. దీంతో ప్రాణభయంతో కాపాడాలంటూ యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆరుగురు వ్యక్తులు శ్రమపడి పొదల్లో నుంచి యువతిని బయటికి తీసి సురక్షితంగా రక్షించారు. అయితే ఈ ఘటనలో యువతి తీవ్రగాయాలపాలవ్వడంతో బీహార్ షరీఫ్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పావపురి మెడికల్ కాలేజీకి తరలించారు.
నలంద జిల్లాలోని రాహుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సదరు యువతి నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి హిరణ్య పర్వతానికి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమెతోపాటు వెళ్లిన వ్యక్తి ఆమె ప్రియుడిగా వారు తెలిపారు. ఇద్దరూ గుడి వెనుక కూర్చుని కొంత సమయం మాట్లాడుకుంటున్నారని, ఆ తర్వాత ఏదో విషయమై వారిరువురు మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. ఆపై ఆమె హిరణ్య పర్వతంపై నుంచి కిందనున్న కాలువలోకి దూకింది. యువతి దూకడంతో ఆమె ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రేమికుడు పరార్, స్థానికుల చోరవతో తప్పిన ప్రమాదం
యువతి అరుపులు విన్న స్థానికులకు పొదల్లో చిక్కుకున్న యువతి కనిపించింది. దీంతో ఓ వ్యక్తి డయల్ 112కి కాల్ చేశారు. పోలీసులు రాకముందే ఆరుగురు వ్యక్తులు 45 నిమిషాల పాటు శ్రమించి బాలికను పొదల్లో నుంచి బయటకు తీశారు. బాలికను పొదల్లో నుంచి బయటకు తీయగానే అపస్మారక స్థితికి చేరుకుంది. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని వైద్యం కోసం సదర్ ఆసుపత్రి బీహార్ షరీఫ్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో పావాపురి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసులో బాధితురాలు మైనర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంత వరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్‌హెచ్‌ఓ సోహసరాయ్ రాజమణి మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.