PM Modi: దేశంలోనే తొలి హైస్పీడ్ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ను ఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ..
PM Modi: ఇండియన్ రైల్వేస్‌లో ఎన్నో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే వారం ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో భారతదేశపు మొట్టమొదటి వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

PM Modi: ఇండియన్ రైల్వేస్‌లో ఎన్నో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే వారం ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో భారతదేశపు మొట్టమొదటి వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఘజియాబాద్‌లో ఉన్న 17 కిలోమీటర్ల ప్రాధాన్యత గల కారిడార్‌లో ర్యాపిడ్ ఎక్స్ పేరుతో దేశంలోనే మొట్టమొదటి ర్యాపిడ్ రైల్‌కు పచ్చ జెండా ఊపి, ప్రధాన మంత్రి తొలి ప్రయాణం చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
నవరాత్రి పర్వదినాల్లో ప్రారంభిస్తున్న ఈ ట్రైన్‌ను మహిళా పైలెట్స్ నడపడటం మరో విశేషం. తద్వారా దేశంలోనే మహిళా పైలట్లతో ప్రారంభోత్సవం చేస్తున్న తొలి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌గా నిలిచిపోతుంంది. కాగా, కమర్షియల్ ట్రైన్ ఆపరేషన్స్ కోసం సాహిబాబాద్ నుంచి దుహై డిపో ప్రాధాన్యతా కారిడార్ నిర్మించడం జరిగింది. ఈ ట్రైన్ ప్రారంభోత్సవానికి వేదికగా నిలుస్తున్న ఈ కారిడార్ నిర్మాణ పనులు నాలుగైదు నెలల క్రితమే పూర్తయ్యాయి. కాగా, ఢిల్లీ, మీరట్‌లను కలిపే ప్రాజెక్ట్‌ను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) పర్యవేక్షిస్తుంది. ప్రయాణికుల కోసం‘RAPIDX Connect’ అనే మొబైల్ యాప్‌ను కూడా ఆవిష్కరించాలని యోచిస్తోంది.
అంతేకాకుండా, దేశీయంగా నిర్మించిన ప్లాట్‌ఫారమ్ స్క్రీన్ కారిడార్‌ను వర్చువల్‌గా ప్రారంభించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా NCRTC ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ టెర్మినస్‌ను కూడా ప్రదర్శిస్తుందనున్నట్లు తెలుస్తోంది. ఇది పానిపట్, అల్వార్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడానికి భవిష్యత్ ప్రాంతీయ రైలు వ్యవస్థ (RRTS) కారిడార్‌లను కలుపుతూ సెంట్రల్ స్టేషన్‌గా పనిచేస్తుంది. 82-కిమీల పొడవైన ఢిల్లీ-మీరట్ ర్యాపిప్ ఎక్స్ నెట్‌వర్క్ 2025 నాటికి పూర్తిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎన్‌సిఆర్‌టిసి. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా.. యూపీఏ-2 సమయంలో RRTS కారిడార్‌ల విస్తరణ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది.
ఈ ట్రైన్‌లో ఫీచర్స్..
ఇక ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్స్ ఆరు కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో సహా అనేక ఆధునిక ఫీచర్‌స్ ఉన్నాయి. ఈ కోచ్‌లలో నాలుగు స్టాండర్డ్ కోచ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రీమియం కోచ్‌తో పాటు రిక్లైనింగ్ సీట్లు, ఎక్స్‌ట్రా లెగ్‌రూమ్, ప్రత్యేక లాంజ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలో ఢిల్లీ మెట్రో మాదిరిగానే మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన కోచ్ కూడా ఉంది. రైలుకు రెండు చివర్లలో పైలట్ క్యాబిన్‌లు ఉన్నాయి. ఓవర్‌హెడ్ లగేజీ ర్యాక్‌లతో అమర్చబడిన ప్రతి రైలులో 2×2 లేఅవుట్‌లో 407 సీట్లు, 1,061 మంది ప్రయాణికులు నిలబడేందుకు వీలుగా ఉంటుంది. ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు, కాంప్లిమెంటరీ ఆన్‌బోర్డ్ వైఫైతో వస్తుంది. పబ్లిక్ అనౌన్స్‌మెంట్, డిస్‌ప్లే సిస్టమ్, డైనమిక్ రూట్ మ్యాప్ డిస్‌ప్లేలు, వీల్‌చైర్‌ల కోసం నిర్దేశించిన ప్రాంతాలు, అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్‌కామ్ ద్వారా డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేసే ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ కూడా ఈ ట్రైన్‌లో ఉంది. రైళ్ల వేగాన్ని పర్యవేక్షించడానికి స్పీడ్ గన్‌లను కూడా అమర్చారు. ఈ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్ వందే భారత్ మాదిరిగానే గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందుకోసం బ్రాడ్ గేజ్ ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..