- Telugu News Photo Gallery According to Government Official 9819 Licensed Guns Have in Telangana and 7007 in Andhra Pradesh
Gun License: ఏపీ, తెలంగాణలో ఎంతమంది వద్ద లైసెన్స్‌డ్ గన్స్ ఉన్నాయో తెలుసా? పూర్తి లెక్కలివే..!
License Guns in Telangana and Andhra Pradesh: తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి. నవంబర్ 30న పోలింగ్ ఉండగా.. పోలింగ్‌కు ముందు ఒక రోజు వరకు ప్రచార పర్వం సాగనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీల నేతలు సమాయత్తం అవుతున్నారు. ఎవరి వారు తమ తమ షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంటున్నారు.
Updated on: Oct 11, 2023 | 11:04 AM

తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి. నవంబర్ 30న పోలింగ్ ఉండగా.. పోలింగ్‌కు ముందు ఒక రోజు వరకు ప్రచార పర్వం సాగనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీల నేతలు సమాయత్తం అవుతున్నారు. ఎవరి వారు తమ తమ షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంటున్నారు.

నేతల ప్లాన్స్ ఇలా ఉంటే.. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ రక్షణ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బులు, బంగారం, ఇతర గిఫ్ట్స్‌ల రవాణాను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా. ముందస్తుగా లైసెన్స్‌డ్ గన్స్‌ను సరెండర్ చేయాలని సదరు వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు సీపీ సీవీ ఆనంద్.

నేతల ప్లాన్స్ ఇలా ఉంటే.. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ రక్షణ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బులు, బంగారం, ఇతర గిఫ్ట్స్‌ల రవాణాను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా. ముందస్తుగా లైసెన్స్‌డ్ గన్స్‌ను సరెండర్ చేయాలని సదరు వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు సీపీ సీవీ ఆనంద్.

ఇదిలాఉంటే.. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో లైసెన్స్‌డ్ గన్స్ వ్యవహారం మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో 9,810 మంది అధికారికంగా గన్స్ కలిగి ఉన్నారు. ఈ లెక్కలల్లో రాష్ట్రాల జాబితాలో టాప్‌లో ఉత్తరప్రదేశ్ ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్ అగ్రస్థానంలో ఉంది.

దేశ వ్యాప్తంగా లెక్కలు చూస్తే.. 33.69 లక్షల మంది లైసెన్స్ కలిగి ఉన్నారు. వీటిలో టాప్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ - 13,29,584, మధ్యప్రదేశ్ - 2,82,675, కర్ణాటక - 1,20,719, పంజాబ్ - 81,516, నాగాలాండ్ - 44,473 లైసెన్స్‌డ్ గన్స్‌తో టాప్ 5 లిస్ట్‌లో ఉన్నాయి.

ఇక ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలో కర్నాటక మినహా మిగతా రాష్ట్రాల్లో లైసెన్స్‌డ్ గన్స్ కలిగిన వారి సంఖ్య చాలా తక్కువగా. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక - 1,20,719 లైసెన్స్‌లతో అగ్రస్థానం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు - 24,237, కేరళ - 11,330, తెలంగాణ - 9,810, ఆంధ్రప్రదేశ్ - 7,007 ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

తెలంగాణలో లెక్కలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం లైసెన్స్‌డ్ గన్స్ కలిగి ఉన్నవారి సంఖ్య 9,810 ఉంది. 2018 ఎన్నికల సమయంలో 9,070 మంది గన్ లైసెన్స్ కలిగి ఉండగా.. ఈ ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 740 మందికి లైసెన్స్ జారీ చేసినట్లు రాష్ట్ర హోంశాఖ లెక్కలు చెబుతున్నాయి.

లైసెన్స్ గన్ కలిగి ఉన్న వారిలో ఎక్కువగా.. భద్రతా సిబ్బంది, క్రీడాకారులు ఉన్నారు. హైదరాబాద్‌లోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే 5 వేలకుపైగా గన్ లైసెన్స్‌లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, పాతబస్తీలో ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.





























