Watch Video: దొరికిందే ఛాన్స్.. కుమ్మేశాడు.. 1 బాల్‌కి 13 రన్స్.. షాకింగ్ వీడియో..

ICC Cricket World Cup 2023: క్రికెట్‌.. అద్భుతాలకు అడ్డాగా చెప్పుకోవచ్చు. ఒక్కో మ్యాచ్.. ఒక్కో రికార్డ్‌కు కేరాఫ్‌గా మారుతుంది. తాజాగా అలాంటి రికార్డ్ వరల్డ్ కప్ వేదికగా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ఆయా దేశాల క్రికెట్ టీమ్స్ పోటీ పడుతున్నాయి. సోమవారం న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్ అద్భుతమైన ఫీట్ సాధించాడు.

Watch Video: దొరికిందే ఛాన్స్.. కుమ్మేశాడు.. 1 బాల్‌కి 13 రన్స్.. షాకింగ్ వీడియో..
Mitchell Santner
Follow us

|

Updated on: Oct 10, 2023 | 2:34 PM

ICC Cricket World Cup 2023: క్రికెట్‌.. అద్భుతాలకు అడ్డాగా చెప్పుకోవచ్చు. ఒక్కో మ్యాచ్.. ఒక్కో రికార్డ్‌కు కేరాఫ్‌గా మారుతుంది. తాజాగా అలాంటి రికార్డ్ వరల్డ్ కప్ వేదికగా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ఆయా దేశాల క్రికెట్ టీమ్స్ పోటీ పడుతున్నాయి. సోమవారం న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్ అద్భుతమైన ఫీట్ సాధించాడు. కేవలం ఒక బంతికి 13 పరుగులు చేసి అరుదైన రికార్డ్ క్రియేట్ నెలకొల్పాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరి బంతికి బాస్ డి లీడ్‌తో కలిసి యాదృచ్ఛికంగా ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతి మిగిలి ఉండగా.. డి లీడే పూల్ టాస్‌ వేసి బౌలింగ్ ముగించాడు. ఆ బంతిని సాంట్నర్ లాంగ్-ఆన్‌పై సిక్సర్‌గా కొట్టాడు. ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు అంపైర్. ఆ బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దాంతో న్యూజిలాండ్‌కు ఫ్రీ హిట్ అందింది. సాంట్నర్ మరోసారి స్ట్రైక్‌లో నిల్చున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన సాంటర్న్.. మళ్లీ చెలరేగిపోయాడు. మరో సిక్స్ కోసం బ్యాక్‌వర్డ్ పాయింట్‌పైకి నెట్టాడు. రెండు సిక్సర్లు, నో బాల్‌తో, కేవలం ఒక లీగల్ డెలివరీకి 13 పరుగులు వచ్చాయి.

ఈ అరుదైన ఫీట్‌కి హైదరాబాద్‌ వేదికగా మారింది. సోమవారం హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 31 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. 17 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లోనూ చెలరేగిపోయాడు. కేవలం 59 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి.. న్యూజిలాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్ 46.3 ఓవర్లలో 223 పరుగలు చేసి ఆలౌట్ అయ్యింది. అంతకు ముందు అహ్మదాబాద్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఒండించిన న్యూజిలాండ్‌ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
'ఇది తొండాట బ్రో'.. రవీంద్ర జడేజాపై ఫ్యాన్స్ ఫైర్.. వీడియో
'ఇది తొండాట బ్రో'.. రవీంద్ర జడేజాపై ఫ్యాన్స్ ఫైర్.. వీడియో
ఈ రూటర్లపై ప్రమాదం పొంచి ఉంది..అప్రమత్తం చేసిన ప్రభుత్వం!
ఈ రూటర్లపై ప్రమాదం పొంచి ఉంది..అప్రమత్తం చేసిన ప్రభుత్వం!
పోలింగ్ అధికారులకు ఎన్నికల అధికారి దిశా నిర్దేశం
పోలింగ్ అధికారులకు ఎన్నికల అధికారి దిశా నిర్దేశం
షిరిడీ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? 3 రోజుల్లో వెళ్లి రావొచ్చు
షిరిడీ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? 3 రోజుల్లో వెళ్లి రావొచ్చు
చిన్న మార్పులే కానీ జీవితాన్ని మారుస్తాయి.. ఈ వాస్తు చిట్కాలతో
చిన్న మార్పులే కానీ జీవితాన్ని మారుస్తాయి.. ఈ వాస్తు చిట్కాలతో
ఓటీటీలో అల్లరోడి 'ఆ ఒక్కటి అడక్కు'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో అల్లరోడి 'ఆ ఒక్కటి అడక్కు'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..!
అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..!
రూ. 10 వేలలోనే 108 ఎంపీ కెమెరా ఫోన్‌.. స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌
రూ. 10 వేలలోనే 108 ఎంపీ కెమెరా ఫోన్‌.. స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌
ఫ్రెషర్లకు పండగలాంటి వార్త.. ప్రభుత్వ బ్యాంకులో 12వేల ఉద్యోగాలు..
ఫ్రెషర్లకు పండగలాంటి వార్త.. ప్రభుత్వ బ్యాంకులో 12వేల ఉద్యోగాలు..
రన్నింగ్‌‌లో ఉన్న బుల్లెట్ బైక్‌కు అంటుకున్న మంటలు.. ఆ తర్వాత..
రన్నింగ్‌‌లో ఉన్న బుల్లెట్ బైక్‌కు అంటుకున్న మంటలు.. ఆ తర్వాత..