AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నిద్రపోతుండగా నోట్లోకి దూరిన పాము.. తరువాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో..

Viral Video: వింత, భయానకమైన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వైద్యుడు ఓ మహిళ నోట్లో నుంచి భారీ పామును తీస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే, మహిళ నోటిలోకి పాము ఎలా ప్రవేశించిందన్నది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం.  వీడియోను చూసి నెటిజన్లు ఇదే ప్రశ్నను రైజ్ చేస్తున్నారు. ఇంత పెద్ద పాము అసలెలా నోట్లోకి వెళ్లింది.

Watch Video: నిద్రపోతుండగా నోట్లోకి దూరిన పాము.. తరువాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో..
Snak In Woman Mouth
Shiva Prajapati
|

Updated on: Oct 09, 2023 | 1:19 AM

Share

Viral Video: వింత, భయానకమైన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వైద్యుడు ఓ మహిళ నోట్లో నుంచి భారీ పామును తీస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే, మహిళ నోటిలోకి పాము ఎలా ప్రవేశించిందన్నది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం.  వీడియోను చూసి నెటిజన్లు ఇదే ప్రశ్నను రైజ్ చేస్తున్నారు. ఇంత పెద్ద పాము అసలెలా నోట్లోకి వెళ్లింది. ఆ విషయం తెలియకుండా ఆమె ఎలా ఉంది? ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. అపస్మారక స్థితిలో ఉన్న మహిళ నోటి నుండి డాక్టర్ ఒక మీటర్ పొడవు పామును తొలగిస్తున్నట్లు కనిపిస్తుంది. మహిళ శరీరంలోకి దూరిన ఈ పాము..  సజీవంగా ఇంకా సజీవంగా ఉండటం మరింత షాక్‌కు గురి చేస్తుంది. మహిళ శరీరంలోకి ప్రవేశించిన పామును ఓ మహిళా డాక్టర్, నర్సు కలిసి బయటకు తీస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. పొడవాటి గొట్టం సహాయంతో పామును బయటకు తీయగానే, అది మెలికలు తిరుగుతుంది. దీంతో పక్కనే ఉన్న నర్సు భయపడుతుంది. ఈ పాము ఒక మీటర్ పొడవు ఉందని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ పాము శరీరంలోకి ప్రవేశించిన మహిళ రష్యాలోని డాగేస్తాన్‌లోని ఒక గ్రామంలో నివాసి అని చెబుతున్నారు. మహిళ తన పెరట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ పాము ఆమె శరీరంలోకి ప్రవేశించిందట.

నోరు తెరిచి నిద్రపోతుండగా..

నిద్రపోతున్నప్పుడు మహిళ నోరు తెరిచి ఉందట. ఆ కారణంగా పాము పాకుతూ ఆమె నోటిలోకి ప్రవేశించింది. పాము ఆమె శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. మహిళ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ముందుగా ఆ మహిళకు అనస్థీషియా ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేశారు.

పాము గురించి తెలియదు..

అది పాము అనే విషయం వైద్యులకు కూడా తెలియలేదు. ఆపరేషన్ సమయంలో శరీరం నుంచి దాన్ని బయటకు తీయగా.. పామును చూసి డాక్టర్లు సైతం అవాక్కయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాము బతికే ఉంది. బయటకు వచ్చిన తర్వాత పాకుతూ వచ్చింది. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో జనాలు జడుసుకుంటున్నారు. ఇలా జరుగుతుందని అస్సలు నమ్మలేకపోతున్నామని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఈ వీడియో వాస్తవానికి 2020 సంవత్సరం నాటిది. కానీ, ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!