AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ప్రపంచకప్‌లో ఎంపికపై విమర్శలు.. కట్‌చేస్తే.. 36 ఏళ్ల వయసులో తుఫాన్ సెంచరీ.. ప్రపంచ రికార్డ్‌తో కౌంటర్..

Dawid Malan Century: ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్ సెంచరీ సాధించాడు. మలాన్ 91 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ 36 ఏళ్ల బ్యాట్స్‌మన్ తన వన్డే కెరీర్‌లో ఆరో సెంచరీని నమోదు చేయడం గమనార్హం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మలన్ కేవలం 23 వన్డే ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడని తెలిస్తే ఆశ్చర్యపోతారంతే. వన్డేల్లో అత్యంత వేగంగా 6 సెంచరీలు చేసిన ఆటగాడిగా డేవిడ్ మలన్ నిలిచాడు.

Video: ప్రపంచకప్‌లో ఎంపికపై విమర్శలు.. కట్‌చేస్తే.. 36 ఏళ్ల వయసులో తుఫాన్ సెంచరీ.. ప్రపంచ రికార్డ్‌తో కౌంటర్..
Dawid Malan Century
Venkata Chari
|

Updated on: Oct 10, 2023 | 3:15 PM

Share

England vs Bangladesh, 7th Match: కెరీర్ ముగిసే వయస్సులో క్రికెటర్లు తరచుగా అన్‌ఫిట్‌గా కనిపిస్తుంటారు. అదే దశలో ఉన్న ఓ ప్లేయర్ సెంచరీ చేయడమే కాదు.. ప్రపంచ రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. ఆయనెవరో కాదు.. ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్. తన బ్యాటింగ్‌తో ధర్మశాల ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ప్రపంచ కప్ 2023లో 7వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అద్భుతమైన సెంచరీని సాధించాడు. ధర్మశాలలో మలన్ కేవలం 91 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మలన్ వన్డేలో ఆరో సెంచరీ సాధించాడు. అతను కేవలం 23 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మలన్ వన్డేల్లో ఎక్కువ హాఫ్ కూడా సెంచరీలు సాధించాడు. వన్డేల్లో ఐదు అర్ధ సెంచరీలు, 6 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీతో భారీ ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 6 సెంచరీలు చేసిన ఆటగాడిగా డేవిడ్ మలన్ నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు సాధించాడు. 27 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేసిన ఇమామ్ ఉల్ హక్ రికార్డును మలన్ బద్దలు కొట్టాడు. మలాన్ సెంచరీలో ప్రత్యేకత ఏమిటంటే, అతను ఎప్పుడూ కష్టమైన వేదికలలోనే సెంచరీలు సాధించడం.

ఇవి కూడా చదవండి

మలాన్ ఓ శతకాల యంత్రం..

డేవిడ్ మలన్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలో కూడా వన్డే సెంచరీలు సాధించాడు. దీంతోపాటు ఇంగ్లండ్‌, నెదర్లాండ్స్‌లో కూడా సెంచరీలు సాధించాడు. డేవిడ్ మలన్‌కు ప్రపంచకప్‌లో ఆడడం కష్టంగా భావించే సమయం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మలాన్ స్థానంలో హ్యారీ బ్రూక్స్‌కు అవకాశం ఇవ్వవచ్చని ఆంగ్ల మీడియాలో చర్చలు జరిగాయి. అయితే ఇంగ్లీష్ సెలక్టర్లు మలాన్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు అతను ప్రపంచ కప్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు.

డేవిడ్ మలన్..

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్ జానీ బెయిర్‌స్టోతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బెయిర్‌స్టో-మలన్ జోడి 17.5 ఓవర్లలో 115 పరుగులు చేసింది. బెయిర్‌స్టో అవుటైన తర్వాత మలన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, అతను కేవలం 39 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని సాధించాడు. 91 బంతుల్లో తన సెంచరీని చేరుకున్నాడు. 107 బంతుల్లో మలన్ బ్యాట్ నుంచి మొత్తం 140 పరుగులు వచ్చాయి. అతను జో రూట్‌తో కలిసి 151 పరుగుల భాగస్వామ్యాన్ని చేసి ఇంగ్లండ్‌ను భారీ స్కోరుకు తీసుకెళ్లాడు.

ఇంగ్లండ్ భారీ స్కోర్..

ఇక నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు సాధించింది. దీంతో బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్ ఇచ్చింది. మలాన్ పెవిలియన్ చేరిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. బెయిర్ స్టో 52, జో రూట్ 82, బట్లర్ 20, బ్రూక్ 20, లివింగ్ స్టోన్ 0, సామ్ కరన్ 11, వోక్స్ 14, రషీద్ 11 పరుగులు చేశారు. మార్క్ వుడ్ 6, టాప్లీ 1 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక బంగ్లాదేశ్ తరపున హసన్ 4, ఇస్లాం 3 వికెట్లు పడగొట్టారు. హమీద్, షకీబ్ తలో వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..