Olympics: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 123 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు.. ఒలింపిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన క్రికెట్.. ఎప్పటినుంచంటే?
Olympic 2028: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ ప్రోగ్రామ్ కమిషన్, IOC మధ్య ఈ అంశంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. ఇప్పుడు, ముంబైలో ఆదివారం ప్రారంభమయ్యే IOC 141వ సెషన్‌లో, ఈ చర్చలో తీసుకున్న నిర్ణయాలకు అధికారికంగా ఆమోదం లభించనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ గురించి మాట్లాడితే, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఇదే మొదటిసారి కాదు. 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఒకసారి ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేర్చారు.
Los Angeles Olympic 2028: ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు ఆడరు అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల మదిలో ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఇకపై ఇలాంటి ప్రశ్నలకు తావుండదని తెలుస్తోంది. మీరు క్రికెట్‌తో పాటు ఒలింపిక్స్‌ను ఇష్టపడేవారైతే, ఈ వార్తతో మీ ఆనందం మరింత రెట్టింపు కానుంది. ఎందుకంటే అతి త్వరలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌కు చేర్చవచ్చని తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌ను చేర్చవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ది గార్డియన్ నివేదిక ప్రకారం, లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ కార్యక్రమంలో నాలుగు కొత్త క్రీడలు చేర్చనున్నారు. ఇందులో క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్ బా, సాఫ్ట్‌బాల్ కూడా ఉంటాయి. ఈ నివేదిక ప్రకారం, ఆర్గనైజింగ్ కమిటీ ఈ కొత్త క్రీడలను జోడించే సమాచారాన్ని రాబోయే 24 గంటల్లో ప్రకటించనుంది. ఇది కాకుండా, లాక్రోస్, స్క్వాష్‌లను కూడా 2028 ఒలింపిక్ క్రీడలలో చేర్చాలని ప్రతిపాదించవచ్చు అంటూ తెలిపింది.
ఇదివరకే ఒలింపిక్స్‌కు చేరిన క్రికెట్..
View this post on Instagram
లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ ప్రోగ్రామ్ కమిషన్, IOC మధ్య ఈ అంశంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. ఇప్పుడు, ముంబైలో ఆదివారం ప్రారంభమయ్యే IOC 141వ సెషన్‌లో, ఈ చర్చలో తీసుకున్న నిర్ణయాలకు అధికారికంగా ఆమోదం లభించనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ గురించి మాట్లాడితే, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఇదే మొదటిసారి కాదు. 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఒకసారి ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేర్చారు. ఆ సమయంలో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ మధ్య బంగారు పతకం కోసం ఒక మ్యాచ్ మాత్రమే జరిగింది. ఆ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ క్రికెట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
ఏ రూపంలో ఉండనుందంటే?
View this post on Instagram
ఇప్పుడు లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్ 2028లో క్రికెట్ ఏ రూపంలో ఉండబోతుందో అధికారికంగా ప్రకటించిన తర్వాతే తెలుస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల క్రికెట్ జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చినట్లయితే, స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడానికి భారతదేశం బలమైన పోటీదారు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..