AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పడిపోయిన నగల కోసం వెతుకుతుండగా నిధి దొరికింది.. పరిశీలించి చూస్తే శతాబ్ధాల కాలం నాటి..

పడిపోయిన ఆభరణాల కోసం వెతుకుతున్నప్పుడు, ఒక కుటుంబం శతాబ్దాల నాటి లాకెట్లు, ఇతర గుర్తు తెలియని ఆభరణాలను చూశారు.. కుటుంబ సభ్యులు మెటల్ డిటెక్టర్‌తో నగల కోసం వెతుకుతుండగా, మెటల్ డిటెక్టర్ మట్టి కింద మెటల్ ఉందని సూచన ఇచ్చింది. కానీ ఇక్కడ తవ్వినప్పుడు పురాతన ఆభరణాల అవశేషాలు కనిపించాయి. అవన్నీ అపూర్వమైన నిధులేనని, వాటి విలువ వాటి వయస్సు, ప్రాముఖ్యతను బట్టి నిర్ణయించబడుతుంది. వివరాల్లోకి వెళితే..

పడిపోయిన నగల కోసం వెతుకుతుండగా నిధి దొరికింది.. పరిశీలించి చూస్తే శతాబ్ధాల కాలం నాటి..
Treasure Discovered
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2023 | 1:55 PM

Share

ఒక కుటుంబం మెటల్ డిటెక్టర్‌తో తమ ప్రాంగణంలో పోయిన బంగారు చెవిపోగు కోసం వెతుకుతున్నప్పుడు అనుకోకుండా ఒక సహస్రాబ్ది కాలం నాటి కళాఖండాలు బయటపడ్డాయి. చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రదేశాల్లో ఇప్పటికీ చెట్లు, మట్టి కింద బంగారం, రత్నాలు వంటి సంపద దాగి ఉందని చెబుతారు. చాలా మంది అలాంటి నిధిని నమ్మరు. కానీ,అలాంటివన్నీ నిజాలే..అక్కడ నిధులు ఉన్నాయి. తరచుగా అలాంటి సంపద గురించిన వార్తలు అనేకం మనం చూస్తూనే ఉంటాము. తాజాగా అలాంటి ఘటనలో విలువైన ఆభరణాలు, రాళ్లు, పనిముట్లు, నాణేలు, శతాబ్దాలుగా, ప్రతి రాజకీయ, సామాజిక పరిస్థితులలో దాచిపెట్టిన, వదిలేసిన, కొన్ని సందర్భాల్లో కాల్చేసిన కళాఖండాలు లభిస్తుంటాయి. అవన్నీ అపూర్వమైన నిధులే. వాటి విలువ వాటి వయస్సు, ప్రాముఖ్యతను బట్టి నిర్ణయించబడుతుంది. వివరాల్లోకి వెళితే..

అయితే, నార్వే దక్షిణ తీరంలో ఉన్న ద్వీపంలోని కుటుంబం తమ ఇంటి తోట మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద ఏదో దాని కోసం వెతుకుతుండగా,.. శతాబ్ధాల కాలం నాటి నిధి దొరికింది. ఎర్లాండ్ బోర్ అనే వ్యక్తి హాబీగా మెటల్ డిటెక్టర్‌తో తన ఇంటి చుట్టూ తిరిగేవాడు. చిన్నతనంలో, పురావస్తు శాస్త్రవేత్త కావాలనేది బోర్ కల. ఈ కోరిక కారణంగానే బోర్ చాలా నడవాలని, ఆరోగ్య సమస్యల కారణంగా ఇంట్లో ఉండకూడదని డాక్టర్ సలహా ఇవ్వడంతో మెటల్ డిటెక్టర్‌తో బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అది ప్రయోజనకరంగా ఉంది. బోర్ బంగారం, రత్నాలతో సహా విలువైన నిధిని కనుగొన్నాడు. ఇది శతాబ్దాల క్రితం ఖననం చేయబడింది.

ఇప్పుడు నార్వే దేశంలోనే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. పడిపోయిన ఆభరణాల కోసం వెతుకుతున్నప్పుడు, ఒక కుటుంబం శతాబ్దాల నాటి లాకెట్లు, మరిన్నింటిని కనుగొన్నారు. కుటుంబ సభ్యులు మెటల్ డిటెక్టర్‌తో నగల కోసం వెతుకుతుండగా, మెటల్ డిటెక్టర్ మట్టి కింద మెటల్ ఉందని సూచన ఇచ్చింది. కానీ ఇక్కడ తవ్వినప్పుడు పురాతన ఆభరణాల అవశేషాలు కనిపించాయి.

ఇవి కూడా చదవండి

కుటుంబానికి శతాబ్దాల క్రితం మహిళలు ధరించే ఆభరణం అవశేషం, మరొక గుర్తించలేని వస్తువు లభించింది. దాంతో ఇది ఒక స్త్రీని సమాధి చేసిన ప్రదేశంగా వారు భావించారు. వారితో పాటుగానే వారు ఉపయోగించిన ఆభరణాలు కూడా దగ్ధమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడ దొరికిన వాటిని పురావస్తు శాఖకు అప్పగించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లక్ చేయండి..