AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాటరీ ఏజెంట్‌ పంట పండింది.. అమ్ముడుపోని టిక్కెట్లకు 1 కోటి బంపర్ బహుమతి..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

బంపర్ ప్రైజ్ వచ్చిందని లాటరీ సంస్థ ఫోన్ చేయడంతో అది ఫేక్ కాల్ అని అరుణ్ భావించాడు. ఆ కాల్‌ని డిస్‌కనెక్ట్ చేసి, ఆ నంబర్‌ను కూడా బ్లాక్ చేశాడు. అయితే, అతనికి మరో నంబర్ నుంచి ఫోన్ చేసి లాటరీ తగిలిందని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను రెండు లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశాడు. అందులో ఒకటి ఉచితంగా పొందాడు. ఆ ఉచిత లాటరీ టిక్కెట్‌కి బంపర్ ప్రైజ్ వచ్చింది.

లాటరీ ఏజెంట్‌ పంట పండింది.. అమ్ముడుపోని టిక్కెట్లకు 1 కోటి బంపర్ బహుమతి..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Kerala Lottery
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2023 | 1:09 PM

Share

అమ్ముడుపోని లాటరీ టిక్కెట్‌కు కోటి రూపాయల బంపర్ ప్రైజ్ వచ్చిన ఘటన కేరళలో వెలుగు చూసింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో బంపర్ ప్రైజ్ కొలికోడ్ కు చెందిన ఎన్.కె. గంగాధరన్ దక్కించుకున్నాడు. అతను లాటరీ షాపు యజమాని. అతని దుకాణంలో అమ్ముడుపోని అనేక టిక్కెట్లలో ఒకదానికి కోటి రూపాయల బహుమతి లభించింది. అతని స్టాల్‌కు పంపిణీ చేసిన 50/50 లాటరీ టిక్కెట్లలో 6 మందికి 5,000 రూపాయలు కూడా బహుమతిగా అందించారు.

33 ఏళ్లుగా బస్ కండక్టర్‌గా పనిచేసిన ఎన్‌కే గంగాధరన్ 3 ఏళ్ల క్రితం కొలికోడ్‌లో లాటరీ దుకాణం పెట్టాడు. అతని షాపులో టికెట్ మొదటి బహుమతి గెలవడం ఇదే మొదటిసారి. లాటరీ డ్రాలో తన దుకాణం టికెట్‌కు బంపర్ బహుమతి వచ్చిందని తెలియడంతో ఆ నంబర్ టికెట్ అమ్ముడుపోలేదని, మిగిలిన లాటరీకి చెందినదని తెలిపారు. ఈ విషయం తెలిసి గంగాధరం ఉలిక్కిపడ్డాడు. బంపర్ లాటరీ తగిలిందని తెలిస్తే చోరీకి గురౌతారని జాగ్రత్తపడి బ్యాంకులో టికెట్ ఇచ్చే వరకు గంగాధర్ ఈ విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదని తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితం బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు. దీని మొత్తం 20 మిలియన్ దిర్హామ్‌లు. అంటే రూ.44 కోట్ల బంపర్ ప్రైజ్. ఈ అదృష్టవంతుడి పేరు అరుణ్ కుమార్ వటక్కె కోరోత్. బంపర్ ప్రైజ్ వచ్చిందని లాటరీ సంస్థ ఫోన్ చేయడంతో అది ఫేక్ కాల్ అని అరుణ్ భావించాడు. ఆ కాల్‌ని డిస్‌కనెక్ట్ చేసి, ఆ నంబర్‌ను కూడా బ్లాక్ చేశాడు. అయితే, అతనికి మరో నంబర్ నుంచి ఫోన్ చేసి లాటరీ తగిలిందని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను రెండు లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశాడు. అందులో ఒకటి ఉచితంగా పొందాడు. ఆ ఉచిత లాటరీ టిక్కెట్‌కి బంపర్ ప్రైజ్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..