Andhra Pradesh: చేపల ప్రియులకు శుభవార్త.. అరుదైన చీరమేను చేప వచ్చిందోచ్.. మార్కెట్‌లో ఫుల్ గిరాకీ.. కేజీ ఎంతంటే!
Mummidivaram: ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో నది పరివాహక ప్రాంతాల్లో మాత్రమే దొరికే అరుదైన చేప చీరమేను...ఈ ప్రాంత వాసులు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుద్దిచ్చేరి, ఫ్రాన్స్, అమెరికాల తోపాటు వివిధ దేశాలలో ఉండే వారి బంధువులకు చీరమేను కూరను పంపించడం విశేషం.... ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా చీర మేను తెప్పించుకుని ఓ పట్టు పట్టేయండి..
యానం, అక్టోబర్08; మాంస ప్రియులు (చేప ప్రియులు) అత్యంత ఇష్టం గా తినే చీరమేను పుద్దిచ్చేరి యానాం మార్కెట్లోకి వచ్చేసింది…యానాం లో స్థానిక ఇందిరాగాంధీ మార్కెట్ లో మత్యకార మహిళ పొన్నమండ రత్నం లీటరు (సేరు) చీరమేను 2,800 రూపాయల కు విక్రయించింది….సాధారణంగా చీరమేను ను త్వవ్వ, సేరు లలో కొలిచి విక్రయిస్తారు మత్యకారులు….ఎక్కువగాయానాం,ఎదురులంక,కోటిపల్లి ,రాజమండ్రి, ధవలేశ్వరం గౌతమి,వైనతేయ,వశిష్ట గోదావరిలో ఒడ్డుకు చేర్చి చీర, రొయ్యల సీడు వలతో చీరమేను పడుతుంటారు.
పులస సీజన్ ముగిసే సమయంలో అక్టోబర్, నవంబర్ నెలల లో మాత్రమే గోదావరి పరివాహక ప్రాంతాల్లో తూర్పు గాలులు వీచే సమయంలో చీరమేను లభిస్తుంది అంటారు మత్స్యకారులు … రొయ్య సీడు పిల్ల కంటే కొంచెం పెద్దగా ఉండే చీరమేను కూర అత్యంత రుచికరంగా ఉంటుంది…చింతకాయ వేసుకుని లేదా మసాలా కలుపుకుని కూర గాను సెనగపిండి కలుపుకుని గారెలు గాను చీరమేను కూర వండుకుని ఇష్టంగా తింటారు మాంస ప్రియలు..
ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో నది పరివాహక ప్రాంతాల్లో మాత్రమే దొరికే అరుదైన చేప చీరమేను…ఈ ప్రాంత వాసులు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుద్దిచ్చేరి, ఫ్రాన్స్, అమెరికాల తోపాటు వివిధ దేశాలలో ఉండే వారి బంధువులకు చీరమేను కూరను పంపించడం విశేషం…. ఇంకెందుకు ఆలుష్యం మీరు కూడా చీర మేను తెప్పించుకుని ఓ పట్టు పట్టేయండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..