AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్మాత్ జాగ్రత్త..! ఒకే ఒక ఫోన్‌కాల్‌ మాట్లాడిస్తా మీ సెల్‌ఫోన్‌ ఇస్తారా అంటూ..! డబ్బు మొత్తం కొల్లగొట్టిన కేటుగాడు..ఎలాగంటే..?

Andhra Pradesh: అయితే, షాపులో రద్దీగా ఉండటంతో రామకృష్ణ ఫోన్ పక్కన పెట్టి తన షాపులోని మిగతా కస్టమర్లతో వ్యాపారంలో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత ఫోన్ ఖాతాలో నగదు విషయంలో వ్యత్యాసం గుర్తించాడు. రూ.99 వేలు తన ఖాతా నుంచి బదిలీ అయినట్లు తెలుసుకొని తను మోసపోయానని బోరున విలపించాడు.. చేసేదిలేక స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. షాపు యజమాని రామకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ మల్లికార్జున రెడ్డి కేటుగాడు కోసం దర్యాప్తు ప్రారంభించారు

తస్మాత్ జాగ్రత్త..! ఒకే ఒక ఫోన్‌కాల్‌ మాట్లాడిస్తా మీ సెల్‌ఫోన్‌ ఇస్తారా అంటూ..! డబ్బు మొత్తం కొల్లగొట్టిన కేటుగాడు..ఎలాగంటే..?
Cyber Crime
Follow us
B Ravi Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 08, 2023 | 9:58 AM

ఏలూరు, అక్టోబర్08 ; ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ వద్దకు వచ్చి ఓక సారి ఫోన్ కాల్ చేసుకుంటాము మీ ఫోన్ ఇవ్వండి అని అడుగుతున్నారా… అయితే ఇది మీకోసమే.. తస్మాత్ జాగ్రత్త.. అలా మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ ఇచ్చారా మీ పని అయిపోయినట్లే… తర్వాత లబోదిబోమంటూ ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు.. నిజంగా తెలియని వ్యక్తులకు మాట్లాడుకునేందుకు ఫోన్ ఇస్తే అంత ప్రమాదం ఉందా.. మాట్లాడుకోవడానికి ఫోన్ ఇస్తే తప్పేంటి.. మాట్లాడుకోవడానికి ఫోన్ ఇవ్వకూడదా.. అని ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే జాగ్రత్తగా తెలుసుకోండి..అలా ఓ వ్యాపారి కస్టమర్ రూపంలో వచ్చిన ఓ కేటుగాడికి ఫోన్ ఇచ్చి ఆతర్వాత బోరుమన్న సంఘటన అందరినీ షాక్‌ కు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో జరిగిన ఘటన అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

ఓ పక్కన టెక్నాలజీ పేరుతో ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోపక్క అదే టెక్నాలజీ ఉపయోగించి ప్రతిరోజు ఏదో ఒకచోట కొందరు కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. రోజు రోజుకి సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువైపోయాయి. పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజల్లో ఎన్నో అవగాహన చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఏదో ఒక రకంగా ఏదో ఒకచోట టెక్నాలజీ సహాయంతో మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో జరిగిన సంఘటన ఇలా కూడా మోసం చేయవచ్చా అనేటట్టుగా వినేవారికి ఆశ్చర్యాన్ని కలగచేసింది. మోసం నుంచి తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

జంగారెడ్డిగూడెంలో రామకృష్ణ అనే వ్యక్తి ఆటోమొబైల్ షాప్ నడుపుతున్నారు. అయితే ఆ ఆటోమొబైల్ షాప్ కస్టమర్లతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దాన్నే అవకాశం గా తీసుకున్నాడు ఓ కేటుగాడు. ఆటోమొబైల్ షాప్ కు వెళ్లి కొన్ని సామాన్లు కొన్నాడు. అనంతరం షాపు యజమాని రామకృష్ణను వేరే వాళ్లకు ఫోన్ చేయాలి అంటూ ఒకసారి ఆయన ఫోన్ ఇమ్మని అడిగాడు. అయితే ఆ వ్యక్తి తన షాపులో ఆటోమొబైల్ సామాన్లు కొనడంతో షాపు యజమాని నా దగ్గరే సామాన్లు కొన్నాడు కదా, కస్టమరే కదా అని అతనిని నమ్మి మాట్లాడటానికి ఫోన్ ఇస్తే ఏమవుతుందిలే.. అని మంచితనంతో తన ఫోన్ ఆ గుర్తు తెలియని కస్టమర్ కి ఇచ్చాడు. ఇంకేముంది కేటుగాడు తన పని మొదలు పెట్టేసాడు. డిజిటల్ లావాదేవీల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి రామకృష్ణ ఫోన్ ద్వారా అతని ఖాతాలోంచి రూ.99 వేలు కాజేశాడు. అనంతరం ఫోన్ మాట్లాడటం అయిపోయిందని షాపు యజమానికి ఫోన్ ఇచ్చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

ఇవి కూడా చదవండి

అయితే, షాపులో రద్దీగా ఉండటంతో రామకృష్ణ ఫోన్ పక్కన పెట్టి తన షాపులోని మిగతా కస్టమర్లతో వ్యాపారంలో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత ఫోన్ ఖాతాలో నగదు విషయంలో వ్యత్యాసం గుర్తించాడు. రూ.99 వేలు తన ఖాతా నుంచి బదిలీ అయినట్లు తెలుసుకొని తను మోసపోయానని బోరున విలపించాడు.. చేసేదిలేక జంగారెడ్డిగూడెం పోలీసులను ఆశ్రయించాడు. షాపు యజమాని రామకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ మల్లికార్జున రెడ్డి కేటుగాడు కోసం దర్యాప్తు ప్రారంభించారు. కాబట్టి గుర్తుతెలియని వ్యక్తులకు మాట్లాడుకుంటాను అంటే గుడ్డిగా నమ్మి ఫోన్ ఇవ్వటం ఎంత ప్రమాదమో ఇప్పటికైనా తెలుసుకోండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..