Panakala Swamy: మంగళగిరి పానకం ధర రూ. కోటి పైమాటే !!

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Oct 09, 2023 | 8:45 AM

మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కొండపై నెలకొన్న పానకాల స్వామిని దర్శించుకనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అయితే నరసింహస్వామి ఇక్కడ మూడు రూపాల్లో కొలువైన ఉన్నారు. మంగళాద్రి కొండ దిగువున లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువై ఉండగా కొండ మధ్యలో పానకాల స్వామిగా కొండపైనే గండాలయ్య స్వామిగా కొలువుదీరారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న భక్తులు తమ బాధలు తీరితే పానకం సమర్పిస్తామని మొక్కుకుంటారు.