Andhra Pradesh: ఉద్యోగాల పేరిట స్కామ్.. నిందితుడు ఎవరో కాదు ఎమ్మెల్యే పీఏనే.. ఏపీలో కలకలం..
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పిఏ బండారు సురేష్ నిర్వాకం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 70 లక్షలు దండుకున్నాడని 18 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమను నమ్మించి సచివాలయానికి తీసుకెళ్లి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చాడని పేర్కొన్నారు.
ప్రకాశం, అక్టోబర్ 8: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పిఏ బండారు సురేష్ నిర్వాకం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 70 లక్షలు దండుకున్నాడని 18 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమను నమ్మించి సచివాలయానికి తీసుకెళ్లి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చాడని పేర్కొన్నారు. కలెక్టర్ ఆఫీసుకు వెళ్తే అవి నకిలీ లెటర్లని తేలిందన్నారు. బండారు సురేష్ దగ్గర వీఆర్‌వో.. ఎఫ్‌సీఐ సహా పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను తాము చూశామన్నారు. ఇంతమోసం చేస్తారా? అని నిలదీస్తే.. ఎవరి డబ్బులు వాళ్లకు ఇవ్వమని ఎమ్మెల్యే సుధాకర్ బాబు చెప్పారని సురేష్ తమతో చెప్పాడన్నారు. మాటలే కానీ మనీ తిరిగి ఇవ్వలేదని వాపోయారు. తమ డబ్బు తమకు ఇవ్వమని అడిగినందుకు తమపై అట్రాసిటీ కేసు పెడుతామని బెదిరిస్తున్నారన్నారు. అంతేకాదు హత్యయత్నానికి కూడా తెగడపడ్డాడని ఆరోపించారు బాధితులు.
ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని నమ్మి తాము అప్పులు తెచ్చి లక్షలకు లక్షలు కడితే తమపైనే దౌర్జన్యం చేస్తున్న ఎమ్మెల్యే పిఏ బండారు సురేష్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు.. తమ దగ్గర వసూలు చేసిన డబ్బుతో పిఏ సురేష్ జల్సాలు చేస్తున్నారని, దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయంటూ వాటిని బయటపెట్టారు… తన పిఏ వ్యవహారంపై ఎమ్మెల్యే కల్పించుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కాగా.. ఈ వ్యవహారం ఏపీలో కలకలం రేపింది. ఎమ్మెల్యే పీఏ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..