తుమ్ములు భరించలేనంతగా ఉంటున్నాయా..? ఆపడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి..

కొన్నిసార్లు ఆపుకోలేని తుమ్ములు మనకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి తుమ్ములను తగ్గించుకోవటానికి చాలా మంది అనేక మార్గాలను వెతుకుతుంటారు. ఈ సమస్య ప్రధానంగా దుమ్ముకు అలర్జీ ఉన్నవారిలో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. తుమ్ములు భరించలేనంతగా ఉన్నప్పుడు.. ఆపడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

తుమ్ములు భరించలేనంతగా ఉంటున్నాయా..? ఆపడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి..
Sneezing
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 08, 2023 | 8:22 AM

తుమ్ములకు నివారణలు: డస్ట్ అలర్జీ వల్ల చాలా మందిలో తుమ్ము అనేది చాలా సాధారణ సమస్య. దుమ్ము, ధూళి లేదా మన ముక్కుకు చికాకు కలిగించే ఏదైనా వచ్చినప్పుడు మనం తుమ్ముతుంటాం. కానీ కొన్నిసార్లు ఆపుకోలేని తుమ్ములు మనకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి తుమ్ములను తగ్గించుకోవటానికి చాలా మంది అనేక మార్గాలను వెతుకుతుంటారు. ఈ సమస్య ప్రధానంగా దుమ్ముకు అలర్జీ ఉన్నవారిలో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. తుమ్ములు భరించలేనంతగా ఉన్నప్పుడు.. ఆపడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

1) తుమ్ములకు కారణాలు తెలుసుకోండి..

మీకు తుమ్ములు వచ్చేలా చేసిన కారణం ఏంటో తెలుసుకోండి..ఇది కొన్నిసార్లు పొడి, పుప్పొడి, పెర్ఫ్యూమ్ కావచ్చు. అది ఏంటో తెలుసుకోండి. దానిని పూర్తిగా నివారించడానికి ప్రయత్నించండి. దీన్ని నివారించడం వల్ల తుమ్ములు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

2) అలెర్జీకి చికిత్స చేయించుకోవటం మంచిది..

మీ అలెర్జీలకు చికిత్స చేయించుకోవడం మరొక పరిష్కారం. మీకు తుమ్ములు రావడానికి మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారో గమనించండి. మీరు రెగ్యూలర్‌గా వెళ్లే వైద్యులను సంప్రదించి అలెర్జీకి కారణాన్ని మరింతగా తెలుసుకోండి.

3) కఠినమైన కాంతిని చూడటం మానుకోండి..

ప్రకాశవంతమైన కాంతిని చూడకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ప్రకాశవంతంగా వెలుగుతున్న లైట్లను చూస్తున్నప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరికి తుమ్ము సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీనినే ఫోటో తుమ్ము అంటారు. ఇది వారసత్వంగా కూడా రావచ్చు. దీని కోసం కూలింగ్ గ్లాసెస్ ఉపయోగించడం ఉత్తమం.

4) మితంగా తినండి..

అతిగా తినడం వల్ల తుమ్ములు వస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. అయితే ఇంతవరకు పెద్దగా సమాచారం బయటకు రాలేదు. అందువల్ల, ఈ విషయంలో ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

5) మీ ముక్కును చిదేసి శుభ్రం చేసుకోవాలి..

ముక్కుకు ఏదైనా ఇబ్బంది కలిగించినప్పుడు తుమ్ములు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తుమ్ములు ఎక్కువగా వస్తున్నప్పుడు ముక్కును బలంగా చిదేయటం మంచిది. ముక్కులో చికాకును బయటకు వెళితే తుమ్ములు ఆగుతాయి.

ఇంకా తుమ్ములు ఎక్కువగా వచ్చేవారు..కొన్ని వంటింటి చిట్కాలను కూడా పాటించి సమస్యను దూరం చేసుకోవచ్చు..అందుకోసం అల్లం టీ, వెల్లుల్లి వేసిన మరిగించిన నీటిని తాగటం వల్ల కూడా తుమ్ముల సమస్య తీరిపోతుంది. ఇంకా దాల్చిన చెక్క పౌడర్, టీస్పూన్ తేనెలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కూడా తుమ్ములు, జలుబు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. మిరియాలు వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల కూడా తుమ్ములు తగ్గుతాయి. హాట్ వాటర్ తో ఆవిరి పట్టటం వల్ల కూడా తుమ్ములు, జలుబు సమస్యలను వదిలించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..