Sikkim Flood: నేటి నుంచి రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన.. వర్షాలు, వరద నష్టంపై అంచనా..

డ్యామ్ కూలిపోవడంతో ప్రమాదం, నష్టం తీవ్రత మరింత పెరిగింది. గత ప్రభుత్వం ఆనకట్ట నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ప్రమాదాన్ని నివారించి ఉండేవారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం కేంద్ర సంస్థల సహాయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు రానున్న 5 రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.

Sikkim Flood: నేటి నుంచి రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన.. వర్షాలు, వరద నష్టంపై అంచనా..
Floods, In Sikkim
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 08, 2023 | 10:53 AM

సిక్కిం వరదల్లో గల్లంతైన 142 మందిలో 62 మందిని సజీవంగా గుర్తించారు రెస్క్యూ టీం సభ్యులు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుందని సైన్యం తెలిపింది. సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఎస్‌డిఎంఎ) తన తాజా బులెటిన్‌లో ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో 81 మంది తప్పిపోయినట్లు తెలిపింది. మరోవైపు సిక్కిం వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. మరో 29 మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 73కి చేరింది. మృతుల్లో ఏడుగురు సైనికులు కూడా ఉన్నారు. సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు సవాలుగా మారుతున్నాయంటున్నారు అధికారులు. చుంగ్టాంగ్ డ్యామ్ కూలిపోవడంపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ విచారం వ్యక్తం చేశారు.

భారీ వర్షాలు, వరదల నుంచి కోలుకోలేక సిక్కిం అతలాకుతలం అవుతోంది. బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో తీస్తా నది ఒడ్డున మరిన్ని మృతదేహాలు లభ్యమవడంతో మృతుల సంఖ్య పెరిగింది. మూడు రోజుల్లో చాలా మృతదేహాలు లభించాయి.. రాష్ట్రంలో 1173 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు సహాయక చర్యలకు సవాల్‌గా మారాయి. ప్రజలు చిక్కుకున్న ప్రాంతంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌, సైన్యం హెలికాప్టర్లను దింపలేకపోయాయి. చుంగ్‌టాంగ్‌లోని సొరంగంలో చిక్కుకుపోయిన సైనికులను, తప్పిపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాగా గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్.. చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. చుంగ్టాంగ్ డ్యామ్ కూలిపోవడంతో నష్టం మరింత పెరిగింది.

ఇదిలా ఉంటే, ప్రకృతి వైపరీత్యం కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం ఆదివారం నుండి రాష్ట్రంలో పర్యటించనుందని కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. సిక్కిం ప్రజలకు ప్రధాని మోదీ సంఘీభావంగా నిలుస్తున్నారని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని మిశ్రా అన్నారు. బుధవారం తెల్లవారుజామున క్లౌడ్‌బర్స్ట్‌తో సంభవించిన ఆకస్మిక వరద హిమాలయ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 41,870 మందిని ప్రభావితం చేసింది. సుమారు 30,300 మంది జనాభా ఈ విపత్తుకు గురయ్యారని సమాచారం.

ఇవి కూడా చదవండి

బుధవారం తెల్లవారుజామున క్లౌడ్‌బర్స్ట్‌తో సంభవించిన ఆకస్మిక వరద హిమాలయ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 41,870 మందిని ప్రభావితం చేసింది. రాష్ట్రంలోని 13 వంతెనలు కొట్టుకుపోయాయి.సుమారు 30,300 మంది జనాభా ఈ విపత్తుకు గురయ్యారని సమాచారం.

చుంగ్టాంగ్ డ్యామ్ కూలిపోవడంతో ప్రమాదం, నష్టం తీవ్రత మరింత పెరిగింది. గత ప్రభుత్వం ఆనకట్ట నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ప్రమాదాన్ని నివారించి ఉండేవారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం కేంద్ర సంస్థల సహాయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు రానున్న 5 రోజుల్లో సిక్కింలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..