Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మీకు మొబైల్ కవర్‌లో డబ్బు పెట్టే అలవాటుందా.. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా గుడ్ బై చెబుతారు

భారతీయులు చాలా తెలివైన వారని మనందరికీ తెలిసిన విషయమే. భారతీయులు తమ సౌకర్యాన్ని బట్టి తక్కువ ఖర్చుతో తమ పనిని పూర్తి చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు కొన్ని ఉపాయాలు ప్రజలకు ఖరీదైనవిగా మారతాయి. అటువంటి వాటిలో జుగాడ్ ఫోన్. డబ్బు ఉంచడం. అదే ఫోన్ కు పెట్టే కవర్ వెనుక ఉంచే డబ్బులు.. మీరు కూడా ఇలా చేస్తూ ఉంటె వెంటనే మానేయండి.

Viral Video: మీకు మొబైల్ కవర్‌లో డబ్బు పెట్టే అలవాటుందా.. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా గుడ్ బై చెబుతారు
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Oct 08, 2023 | 12:20 PM

ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రజలు ఇష్టపడే వివిధ రకాల వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. అయితే మనల్ని అలరించే అలాంటి వీడియోలను ప్రతిసారీ చూడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని వీడియోలు కూడా మనకు ఆసక్తికరమైన సమాచారాన్ని అందిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఫోన్‌లో డబ్బులు ఉంచడం ఎంత ప్రమాదమో చెప్పబడింది.

భారతీయులు చాలా తెలివైన వారని మనందరికీ తెలిసిన విషయమే. భారతీయులు తమ సౌకర్యాన్ని బట్టి తక్కువ ఖర్చుతో తమ పనిని పూర్తి చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు కొన్ని ఉపాయాలు ప్రజలకు ఖరీదైనవిగా మారతాయి. అటువంటి వాటిలో జుగాడ్ ఫోన్. డబ్బు ఉంచడం. అదే ఫోన్ కు పెట్టే కవర్ వెనుక ఉంచే డబ్బులు.. మీరు కూడా ఇలా చేస్తూ ఉంటె వెంటనే మానేయండి. ఈ అలవాటు మీ మరణానికి కారణం కావచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఈ అలవాటు మానేస్తారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో ఫోన్ ప్రాసెసర్ పూర్తి వేగంతో పని చేస్తే.. మన ఫోన్ వేడెక్కుతుందని చెప్పబడింది. దీని కారణంగా వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి చాలా ప్రమాదకరం. దీని కారణంగా మీ ఫోన్ సులభంగా మంట బారిన పడే అవకాశం ఉంది. నోట్ల తయారీకి పేపర్‌తో పాటు అనేక రకాల రసాయనాలను కూడా వినియోగిస్తారు. దీని వెనుక ఉన్న కారణాన్ని వీడియోలో కూడా తెలిపారు. ఈ రసాయనాల కారణంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఈ వీడియోను అనామికవర్సటైల్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి, మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఈ వీడియోను చూశారు. దీనిపై తమ తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..