Viral News: థాయిలాండ్ అడవిలో అరుదైన సాలీడు.. గత కొంత కాలంగా అక్రమ రవాణా..

మీడియా నివేదికల ప్రకారం కొత్త జీవి థాయ్‌లాండ్‌ లో వెలుగులోకి వచ్చింది.  ఫాంగ్-న్గా లో థాయ్  పరిశోధకులు టరాన్టులా స్పైడర్ అనే  కొత్త జీవి గురించి తెలుసుకున్నారు. ఇది ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. ఈ నీలం రంగు జీవులు చాలా అరుదు. ఈ స్పైడర్‌ని చూసిన తర్వాత డాక్టర్ నరిన్ చోంఫు ఫుంగ్ ఈ సంఘటనపై స్పందించారు.

Viral News: థాయిలాండ్ అడవిలో అరుదైన సాలీడు.. గత కొంత కాలంగా అక్రమ రవాణా..
Blue Tarantula
Follow us

|

Updated on: Sep 30, 2023 | 1:06 PM

ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం వింత జీవులతో నిండి ఉంది. అలాంటి జీవి మన కనుల ముందుకు  వచ్చినప్పుడల్లా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా ప్రకృతిని పరిశీలిస్తే ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో మనకు ఏదొక వింతను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఓ స్పైడ‌ర్ ప‌తాక వార్త‌ల్లో నిలుస్తోంది. వీటి స్వరూపం సైంటిస్టులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మీడియా నివేదికల ప్రకారం కొత్త జీవి థాయ్‌లాండ్‌ లో వెలుగులోకి వచ్చింది.  ఫాంగ్-న్గా లో థాయ్  పరిశోధకులు టరాన్టులా స్పైడర్ అనే  కొత్త జీవి గురించి తెలుసుకున్నారు. ఇది ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. ఈ నీలం రంగు జీవులు చాలా అరుదు. ఈ స్పైడర్‌ని చూసిన తర్వాత డాక్టర్ నరిన్ చోంఫు ఫుంగ్ ఈ సంఘటనపై స్పందించారు. తాము కొత్త జాతి సాలీడు కోసం వెతకడంలో బిజీగా ఉన్నాము. ఆ  సమయంలో తాము కొత్త సాలీడును కనుగొన్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ సాలీడు మానవులకు ప్రమాదకరమా?

ఈ సాలీడు గురించి శాస్త్రవేత్త మాట్లాడుతూ.. తాము తమ అన్వేషణలో ముందుకు సాగుతున్నప్పుడు..  ఈ సాలీడు చెట్టులోని ఖాళీ ట్రంక్ లోపల దాగి ఉన్న మడ అడవుల్లో కనిపించిందని చెప్పారు. శాస్త్రవేత్తల ప్రకారం వారు ఈ జాతికి చిలోబ్రాకిస్ నతని చారమ్ అని పేరు పెట్టారు. ఈ సాలీడు రంగును చూసి సైంటిస్టులు దానికి అడవి రత్నం అని పేరు పెట్టారు. ఇంగ్లీష్ వెబ్‌సైట్ సైన్స్ అలర్ట్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ నీలం రంగు పిగ్మెంటేషన్ వల్ల కాదు.. సహజ నిర్మాణాల వల్ల వచ్చిందని పేర్కొన్నారు.

దక్షిణ థాయిలాండ్ అడవులలో నీలిరంగు టరాన్టులా

ఈ సాలీడు రంగు ప్రజలను బాగా ఆకర్షిస్తుంది. ప్రజలు తమ స్వంత ప్రయోజనం కోసం ఈ సాలీడుని  కొనుగోలు చేసి అమ్ముతున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ సాలీడు విషపూరితమైనది కాదు. ఈ కారణంగానే గత కొంత కాలంగా సాలె పురుగుల అక్రమ వ్యాపారంలో ఈ సాలీడు కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

త్రిషపై పొలిటికల్ లీడర్ చీప్ కామెంట్స్.. ఘాటుగా స్పందించిన విశాల్
త్రిషపై పొలిటికల్ లీడర్ చీప్ కామెంట్స్.. ఘాటుగా స్పందించిన విశాల్
మస్క్.. నువ్వు గ్రేట్ !! మెదడులో చిప్ పని చేస్తోందోచ్
మస్క్.. నువ్వు గ్రేట్ !! మెదడులో చిప్ పని చేస్తోందోచ్
హైఅలర్ట్.. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత.. కేంద్రం కీలక ఆదేశాలు
హైఅలర్ట్.. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత.. కేంద్రం కీలక ఆదేశాలు
హైదరాబాద్ లో రామ్ చరణ్-శంకర్ మూవీ షూటింగ్.. భారీ యాక్షన్ సీక్వెన్
హైదరాబాద్ లో రామ్ చరణ్-శంకర్ మూవీ షూటింగ్.. భారీ యాక్షన్ సీక్వెన్
పవన్‌ కల్యాణ్‌తో మూడు ముళ్ల బంధంలోకి బిగ్ బాస్ బ్యూటీ వాసంతి
పవన్‌ కల్యాణ్‌తో మూడు ముళ్ల బంధంలోకి బిగ్ బాస్ బ్యూటీ వాసంతి
దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ.. త్వరలో రంగంలోకి అమిత్ షా
దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ.. త్వరలో రంగంలోకి అమిత్ షా
కైలాస మానస సరోవరం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
కైలాస మానస సరోవరం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 2025 నాటికి 40 లక్షల ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 2025 నాటికి 40 లక్షల ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాపై బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌.. సంక్షోభంలో కోళ్ల పరిశ్రమ
చిత్తూరు జిల్లాపై బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌.. సంక్షోభంలో కోళ్ల పరిశ్రమ
హీరోయిన్ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు
హీరోయిన్ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు