Viral News: కస్టమర్‌కు మూడు రూపాయల చిల్లర ఇవ్వని జిరాక్స్ షాప్ సెంటర్ యజమాని.. ఇపుడు ఏకంగా రూ.25 వేలు ఇవ్వాల్సి వచ్చింది..

ఐదు రూపాయలకు కూడా చిల్లర లేదంటూ ఏ ఐదు రూపాయల విలువజేసే చాకోలెట్ చేతిలో పెడుతున్నాడు. ఇష్టం ఉన్న లేక పోయినా ఆ చాకోలెట్ ను తీస్కుని తిట్టుకుంటూ ఇంటికి చేరుకుంటాం. ఇదే పద్ధతిని ఫాలో అయిన ఒక జిరాక్స్ సెంటర్ యజమాని చిల్లర లేదంటూ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇప్పుడు ఏకంగా వేల రూపాయలను నష్టపరిహారంగా చెల్లిస్తున్నాడు.. 

Viral News: కస్టమర్‌కు మూడు రూపాయల చిల్లర ఇవ్వని జిరాక్స్ షాప్ సెంటర్ యజమాని.. ఇపుడు ఏకంగా రూ.25 వేలు ఇవ్వాల్సి వచ్చింది..
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Sep 29, 2023 | 11:22 AM

ఒక షాప్ దగ్గరకు వెళ్లి ఏదైనా వస్తువు లేదా తినే పదార్ధం వంటివి కొనుగోలు చేస్తే.. మనం ఇచ్చిన డబ్బులు లెక్క కట్టి రుపాయికి చిల్లర లేదు అంటూ దాని కాస్ట్ లో చాకోలెట్స్ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు కొంచెం అప్ డేట్ అయ్యి.. ఐదు రూపాయలకు కూడా చిల్లర లేదంటూ ఏ ఐదు రూపాయల విలువజేసే చాకోలెట్ చేతిలో పెడుతున్నాడు. ఇష్టం ఉన్న లేక పోయినా ఆ చాకోలెట్ ను తీస్కుని తిట్టుకుంటూ ఇంటికి చేరుకుంటాం. ఇదే పద్ధతిని ఫాలో అయిన ఒక జిరాక్స్ సెంటర్ యజమాని చిల్లర లేదంటూ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇప్పుడు ఏకంగా వేల రూపాయలను నష్టపరిహారంగా చెల్లిస్తున్నాడు..  వివరాల్లోకి వెళ్తే..

ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఒక కస్టమర్ జి రాక్స్ ను తీసుకోవడానికి ఒక షాప్ దగ్గరకు వెళ్ళాడు. ఆ జిరాక్స్ సెంటర్ యజమానిపై ఇప్పుడు కేసు నమోదైంది.  జిరాక్స్ షాప్ సెంటర్ యజమాని ఒక జి రాక్స్ ను ప్రింట్ తీసి ఇచ్చాడు. దీని కోసం కస్టమర్ రెండు రూపాయలు చెల్లించవలసి వచ్చింది.. అయితే ఆ కస్టమర్ తన దగ్గర చిల్లర లేదని ఐదు రూపాయలు ఉందని షాప్ యజమానికి చెల్లించాడు. రెండు రూపాయలు తీసుకుని మిగిలిన డబ్బును తిరిగి అడగడంతో.. ఆ దుకాణదారుడు మొరటుగా.. మిగిలిన డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో వినియోగదారుడు దుకాణదారుపై వినియోగదారుల కోర్టులో కేసు వేశారు.

తన నిర్ణయాన్ని వెల్లడించిన కోర్టు

మీడియా కథనాల ప్రకారం.. ఈ సంఘటన ఏప్రిల్ 28 న జరిగింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సెప్టెంబర్ 26న రూ.25వేలు జరిమానా చెల్లించాలని దుకాణదారుని ఆదేశించింది. దుకాణదారుడు ముప్పై రోజులలోపు ఈ మొత్తాన్ని చెల్లించకపోతే.. ప్రతి సంవత్సరం 9 శాతం చొప్పున వడ్డీని ఇవ్వాల్సి ఉంటుందని తీర్పు నిచ్చింది.

ఇవి కూడా చదవండి

కస్టమర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ.. కస్టమర్లు తమ హక్కుల గురించి అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా దుకాణదారుడు మీకు బిల్లు ఇవ్వకపోయినా లేదా మీతో అనుచితంగా ప్రవర్తిస్తే.. ఆ దుకాణం దారుడిపై కోర్టులో కేసు వేయాలని కోర్టు తెలిపింది. త్వరలోనే కస్టమర్ కు తప్పకుండా న్యాయం జరుగుతుందని కోర్టు హామీ ఇచ్చింది. కోర్టు నిర్ణయంపై కస్టమర్ తన స్పందనను తెలియజేస్తూ కోర్టు నిర్ణయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను.. తన లాంటి వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..