Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆ మహిళ పాదాలంటే జనాలకు పిచ్చి.. పాదాల ఫోటోలను అమ్మి నెలకు లక్షల్లో సంపాదన..

కొందరు తమ శరీరాన్ని వివిధ రకాలుగా అలంకరించుకుని తద్వారా లక్షలను ఆర్జిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ రోజు ఓ మహిళ తన పాదాల చిత్రాన్నిషేర్ చేస్తూ  తద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఈ మహిళ తన పాదాల ఫోటోలను అమ్మడం ద్వారా ప్రతి నెలా ఐదు లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తోంది. 

Viral News: ఆ మహిళ పాదాలంటే జనాలకు పిచ్చి.. పాదాల ఫోటోలను అమ్మి నెలకు లక్షల్లో సంపాదన..
Woman Selling Legs PhotosImage Credit source: sin_is_feet/Instagram
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2023 | 12:43 PM

వ్యాపారం అంటే ఎడారిలో నీరు అమ్మడం తెలివైన పని.. అదే సమయంలో ఏడాదిలో ఖర్జురాన్ని సైతం అమ్మే తెలివి తేటలు సరైన వ్యాపారస్తులు లక్షణం అని అంటారు. అవును వస్తువులను ఎలా విక్రయించాలో మీకు తెలిస్తే ఏదైనా, ఎటువంటి వస్తువునైనా అమ్మగలరు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో పలువురు నిరూపిస్తున్నారు కూడా.. వస్తువులను అమ్ముకుని లక్షల రూపాయలు సంపాదిస్తున్నవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొందరు తమ శరీరాన్ని వివిధ రకాలుగా అలంకరించుకుని తద్వారా లక్షలను ఆర్జిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ రోజు ఓ మహిళ తన పాదాల చిత్రాన్నిషేర్ చేస్తూ  తద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఈ మహిళ తన పాదాల ఫోటోలను అమ్మడం ద్వారా ప్రతి నెలా ఐదు లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తోంది.

ఆ మహిళ లండన్‌కు చెందిన సిని ఏరియల్. ఆమె వృత్తిరీత్యా మోడల్, టాటూ ఆర్టిస్ట్.. అయితే ఆమె ప్రధాన ఆదాయ వనరు ఆమె పాదాలు. తన పాదాల ద్వారా ఆమె ప్రతి నెలా 5,000 పౌండ్లు (రూ. 5 లక్షలకు పైగా) సంపాదిస్తుంది. ఈ డబ్బుతో ఆమె తన అభిరుచులన్నింటినీ నెరవేర్చుకుంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాలను సందర్శిస్తుంది. ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.

ఎలా సంపాదిస్తుందంటే

తన పాదాల మూడు చిత్రాలను మాత్రమే చూడటానికి ప్రజలు ఇష్టపడతారని 41 ఏళ్ల సినీ చెప్పింది. ఒక పాదం అరికాళ్లను చూపిస్తూ మరో పాదంతో నేలపై పడి ఉన్న వస్తువులను ఎంచుకొని మూడో పాదాన్ని ముందుకు లాగుతోంది. ఈ చిత్రాలను చూసినందుకు ప్రజలు లక్షల రూపాయలు ఇస్తారు. డైలీ స్టార్‌తో మాట్లాడుతూ ఆమె తన చిత్రాలను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తుందని, ఆపై వాటి గురించి వివరణ రాస్తుందని చెప్పింది. దీని తర్వాత ఆమె ఆ చిత్రాల ధరను ఫిక్స్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి చిత్రాల వల్ల కొన్నిసార్లు తన ఆదాయం ఏడు లక్షలకు మించి ఉంటుందని.. ప్రస్తుతం తాను విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని, తన కెరీర్‌కు సంబంధించి ఇప్పుడు వెబ్‌సైట్‌ను తెరవబోతున్నానని చెప్పింది. ఆమె ఫోటోగ్రాఫ్‌లను అమ్మడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..