AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గుర్రంపై స్వారీ చేస్తూ షాపింగ్ మాల్‌లో చక్కర్లు కొట్టిన వ్యక్తి.. వీడియో నెట్టింట్లో వైరల్

సాధారణంగా మాల్‌లో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సార్లు షాపింగ్‌కు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.. అయితే ఈరోజుల్లో షాపింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది చూసిన ప్రజలు షాక్ అయ్యారు. అదే సమయంలో ఇదేంటి అంటూ కలత చెందారు.

Viral Video: గుర్రంపై స్వారీ చేస్తూ షాపింగ్ మాల్‌లో చక్కర్లు కొట్టిన వ్యక్తి.. వీడియో నెట్టింట్లో వైరల్
Video Viral
Surya Kala
|

Updated on: Sep 23, 2023 | 12:17 PM

Share

షాపింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ విషయం. అందరూ ఏదొక సందర్భంలో చేయాల్సిందే. అవును మరికొందరు వీధిలో ఉండే చిన్న చిన్న షాపులకు వెళ్లి షాపింగ్ చేస్తుంటే మరికొందరు మాల్స్‌కు వెళతారు. మాల్‌లోని వస్తువులు కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ, వాటికి నాణ్యత ఉంటుంది, అంటే, సాధారణంగా మాల్స్ లోని వస్తువులు మంచి నాణ్యతతో ఉంటాయి. అందుకనే చాలామంది మాల్స్ నుండి మాత్రమే షాపింగ్ చేయడానికి ఇష్టపడటానికి ఇష్టపడతారు. సాధారణంగా మాల్‌లో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సార్లు షాపింగ్‌కు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.. అయితే ఈరోజుల్లో షాపింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది చూసిన ప్రజలు షాక్ అయ్యారు. అదే సమయంలో ఇదేంటి అంటూ కలత చెందారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి షాపింగ్ చేయాలనే ఉద్దేశంతో మాల్‌కు వచ్చాడు, అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చాడు. అతను గుర్రంపై కూర్చొని మాల్ లోపల తిరుగుతూ కనిపించాడు. ఆ వ్యక్తి తెల్లటి గుర్రంపై ఎక్కి షాపింగ్ మాల్‌లో తిరుగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో అతని చేతిలో బకెట్ లాంటిది కనిపించింది. బహుశా అతను ఆ బకెట్‌ను మాల్ నుండి కొనుగోలు చేసి ఉండవచ్చు, అది తప్ప అతను మరేమీ కొనడం కనిపించలేదు. ఈ ఫన్నీ సీన్ చూసిన జనం కళ్లు బైర్లు కమ్మాయి. అతను మాల్ నుండి బయటకు రావడం ప్రారంభించిన సమయంలో మాల్ లో ఉన్న వ్యక్తులు తమ సెల్స్ కు పని చెప్పి వీడియో ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

 ఫన్నీ వీడియో చూడండి

ఈ ఫన్నీ వీడియో టెక్సాస్ లోని అని తెలుస్తోంది. గుర్రం మీద ఓ వ్యక్తి  స్వారీ చేస్తూ ఇక్కడి వాల్‌మార్ట్ షోరూమ్‌కి వచ్చినట్లు క్లెయిమ్ చేయబడింది. ఈ వీడియో @MadVidss అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 21 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు.

అదే సమయంలో, వందలాది మంది వీడియోను లైక్ చేసారు. వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. టెక్సాస్‌లో ఇది మామూలే అని ఎవరో చెబుతుంటే, తన గుర్రం దూకుడుగా వెళ్ళాక పోవడం అతని అదృష్టమని ఎవరో సరదాగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో