AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇష్టమైన ఫుడ్ అని పీతను ఆర్డర్ చేసింది.. బిల్లు చూసి సృహ కోల్పోయింది.. ఒక్క పీత ఖరీదు ఎంతో తెలుసా..

ఈ ఘటన సెప్టెంబర్ 15వ తేదీన జరిగింది. సింగపూర్‌లోని ప్రసిద్ధ చిల్లీ క్రాబ్ వంటకాన్ని రుచి చూడాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒక రెస్టారెంట్‌కి వెళ్లింది. అయితే తాను తిన్న చిల్లీ క్రాబ్ ఫుడ్ కు సదరు రెస్టారెంట్ తన నుండి చాలా డబ్బులు వసూలు చేసిందంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.

Viral News: ఇష్టమైన ఫుడ్ అని పీతను ఆర్డర్ చేసింది.. బిల్లు చూసి సృహ కోల్పోయింది.. ఒక్క పీత ఖరీదు ఎంతో తెలుసా..
Alaskan King Chili Crab
Surya Kala
|

Updated on: Sep 22, 2023 | 3:18 PM

Share

ప్రపంచంలో వింత వింత ఆహారపు అలవాట్లు ఉన్నవారు అనేక మంది ఉన్నారు. కూరగాయలు, దుంపలు, కోడి, మేక వంటివాటితో చేసిన ఆహారాన్ని మాత్రమే కాదు పురుగులు, పాములు, తేళ్లు వంటి వాటితో చేసిన వంటకాలను కూడా ఇష్టంగా తినేవారు కోట్లాది మంది ఉన్నారు. ఆహారప్రియుల అభిరుచికి అనుగుణంగా మార్కెట్‌లో రకరకాల ఆహారం లభిస్తోంది కూడా.. సీ  ఫుడ్ లవర్స్ లో ఎక్కువుగా పీతలను ఇష్టంగా తినేవారు ఉన్నారు. ప్రస్తుతం పీతలకు సంబంధించిన ఓ వార్త బాగా చర్చనీయాంశమైంది. సాధారణంగా పీతలు భారతదేశంలో కిలో రూ. 200 నుంచి 400లకు లభిస్తాయి. అయితే హోటల్ లో పీతలు తిని ఆ బిల్లు చూసి కరెంట్ షాక్ తిన్నట్లు కళ్లు తిరిగి పడిపోయిన సంఘటన ఒకటి తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.  సింగపూర్‌లో జపాన్ మహిళా టూరిస్ట్‌ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఎదుర్కొంది. ఆ మహిళ ఓ రెస్టారెంట్‌లో ఫుడ్ తినడానికి వెళ్ళింది. అక్కడ ఆమె పీతలు తింది తాను తిన్న ఆహారంలో ఒక్క పీతలకె మన దేశ కరెన్సీలో రూ. 57 వేలు వేశారు. దీంతో ఆ బిల్లుని చూసి ఆమె స్పృహ కోల్పోయింది.

న్యూయార్క్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం.. మహిళ పేరు జుంకో షిన్బా.  ఈ ఘటన సెప్టెంబర్ 15వ తేదీన జరిగింది. సింగపూర్‌లోని ప్రసిద్ధ చిల్లీ క్రాబ్ వంటకాన్ని రుచి చూడాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒక రెస్టారెంట్‌కి వెళ్లింది. అయితే తాను తిన్న చిల్లీ క్రాబ్ ఫుడ్ కు సదరు రెస్టారెంట్ తన నుండి చాలా డబ్బులు  వసూలు చేసిందంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.

తాను రెస్టారెంట్ కు వెళ్ళినపుడు  రెస్టారెంట్‌లోని వెయిటర్  అలస్కాన్ కింగ్ క్రాబ్ చిల్లీ డిష్‌ను ప్రయత్నించమని సూచించాడని.. ఆ వంటకం ధర కేవలం 30 డాలర్లు అంటే 2500 రూపాయలు అని చెప్పాడని.. అయితే ఈ ధర 100 గ్రాముల పీతకు మాత్రమేనని అతను చెప్పలేదని మహిళ చెప్పింది. ..

ఇవి కూడా చదవండి

తనకు అసలు విషయం తెలియకపోవడంతో అలాస్కాన్ కింగ్ క్రాబ్ చిల్లీ డిష్‌ను ఆర్డర్ చేసినట్లు పేర్కొంది.  అంతేకాదు ఆమెతో పాటు రెస్టారెంట్ కు వెళ్లిన బృందంలోని ఇతర సభ్యులు కూడా వారికి నచ్చిన వంటకాలను ఆర్డర్ చేశారు. తర్వాత భోజనం చేసి ఎంజాయ్ చేశారు. తీరా బిల్లు రాగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తం బిల్లు 1,322 డాలర్లు అంటే దాదాపు 80 వేల రూపాయలు. ఇందులో ఒక్క అలస్కా కింగ్ క్రాబ్ డిష్ ధర 938 డాలర్లు అంటే దాదాపు 57 వేల రూపాయలు కాగా, ఇతర వంటకాల ధర 20 డాలర్లు లేదా అంతకంటే తక్కువ.

నలుగురి భోజనానికి అయిన  ఖర్చు చాలా ఎక్కువ అని భావించి మేమంతా ఆశ్చర్యపోయామని ఆ మహిళ చెప్పింది. పీతలు ఆర్డర్ పెట్టె ముందు బరువు గురించి రెస్టారెంట్ తనకు తెలియజేయలేదని.. అందుకనే తాను బరువు చూసుకోకుండా పీతను మొత్తం ఆర్డర్ పెట్టినట్లు పేర్కొంది. అయితే ఆ రెస్టారెంట్ తనకు వేసిన బిల్లు మొత్తాన్ని చెల్లించడానికి సరిపడా డబ్బులేవు అని చెప్పడంతో… ఆమెకు రెస్టారెంట్ $107 తగ్గింపు ఇచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..