AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potato Chips: కరకరలాడే ఆలు చిప్స్.. ఎలా తయారు చేస్తారో తెలుసా..? ఈ వీడియో చూసి ఈజీగా ట్రై చేయండి..

చిప్స్‌ ఫ్యాక్టరీలో తీసిన వీడియోలో మార్కెట్‌ నుంచి కొనితెచ్చిన ఆలూ బ్యాగ్‌ ఓపెన్‌ చేయడం దగ్గర నుంచి.. ఆలూ చిప్స్‌ తయారీ వరకు మొత్తం ప్రక్రియను చూపించారు... అనికైత్ లూత్రా అనే వినియోగదారు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Potato Chips: కరకరలాడే ఆలు చిప్స్.. ఎలా తయారు చేస్తారో తెలుసా..? ఈ వీడియో చూసి ఈజీగా ట్రై చేయండి..
Potato Chips
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2023 | 3:46 PM

Share

ఆలూ చిప్స్ అంటే… ఖచ్చితంగా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్స్. స్నేహితులతో చాట్ చేసినా, ప్రయాణం చేసినా, సినిమా చూసినా, ప్రతి పనిలోనూ చిప్స్ ప్యాకెట్లు ఎప్పుడూ వెంటే ఉంటాయి. అయితే ఈ చిప్స్ ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా? ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. చిప్స్‌ ఫ్యాక్టరీలో తీసిన వీడియోలో మార్కెట్‌ నుంచి కొనితెచ్చిన ఆలూ బ్యాగ్‌ ఓపెన్‌ చేయడం దగ్గర నుంచి.. ఆలూ చిప్స్‌ తయారీ వరకు మొత్తం ప్రక్రియను చూపించారు… అనికైత్ లూత్రా అనే వినియోగదారు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

వీడియోలో, ముందుగా బంగాళాదుంపల సంచులను మోసుకొస్తున్న కార్మికులు కనిపిస్తున్నారు. ఈ ప్రక్రియలో బంగాళాదుంపలను జాగ్రత్తగా కడగడం, వాటిని తొక్కడం, వాటిని సరైన పరిమాణంలో ముక్కలుగా కట్ చేయడం, వాటిని మళ్లీ కడగడం, ఎండబెట్టడం, నూనెలో వేయించడం వరకు ప్రతి పనిని నిశితంగా చూపించారు.

ఇవి కూడా చదవండి

ముందుగా బంగాళదుంపల సంచులను విప్పి ఒక చోట పోస్తారు. అప్పుడు బంగాళదుంపలను బాగా కడిగారు..ఆ తర్వాత యంత్రాల సాయంతో ఆలు తొక్కలు తీసేశారు. అనంతరం బంగాళాదుంపలను చిప్స్ తయారీకి అనువైన ఆకారాలలో కట్ చేస్తారు. అది మళ్లీ కడిగి, మెషీన్‌లో వేశారు.. తర్వాత చిప్స్ రూపంలో ఆలూ బయటకు వస్తుంది. తయారైన చిప్స్‌ని మళ్లీ ఉప్పునీటిలో నానబెట్టి ఎండబెడుతున్నారు. అప్పుడు అది వేడి నూనెలో డీప్‌ఫ్రై చేశారు. ఆ తర్వాత వాటికి మంచి రుచి కోసం చిప్స్‌కి కొన్ని మసాలాలు వేస్తున్నారు. ఆ తర్వాత, చిప్స్ ప్యాకెట్లను ప్యాక్ చేసి పెద్ద పెద్ద అట్టపెట్టెల్లో సర్దేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోని నెటిజన్లు ఎంతగానో ఆదరిస్తున్నారు.

ఈ వీడియోను ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా వీక్షించారు. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు వీడియోపై తమ వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..