Viral Video: పిచ్చి పీక్ స్టేజ్.. నాలికను రెండుగా కట్ చేయించుకున్న యువతి.. వీడియో చూసి షాక్.
మీరు నాలిక రెండుగా చీలి ఉన్న వ్యక్తి ఎప్పుడైనా చూశారా.. ప్రస్తుతం అలాంటి ఓ మహిళ వార్తల్లో నిలుస్తోంది. ఈ మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి ప్రజలను ఆశ్చర్యపరిచింది. తన టిక్‌టాక్ ఖాతాలో ఆహారానికి సంబంధించిన క్లిప్‌ను అప్‌లోడ్ చేసింది. దానిని చూసిన నెటిజన్లు తమ కళ్లను నమ్మలేకపోయారు.
ప్రపంచంలో రెండు నాలుకల జీవి అనగానే పాము గుర్తుకొస్తుంది. హిందూ పురాణాల ప్రకారం పాముకు నాలికతో చీలిక ఏర్పడానికి ఓ కథ కూడా ఉంది. అయితే ఒక్క నాలిక ఉన్న మనిషి.. సందర్భానుసారంగా ఎటువీలైతే అటు మాట్లాడతాడని రెండు నాల్కల ధోరణి అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు.. అయితే పాములో మాత్రమే కనిపించే రెండు నాలుకలు మనిషి కూడా ఉంటే.. మీరు నాలిక రెండుగా చీలి ఉన్న వ్యక్తి ఎప్పుడైనా చూశారా.. ప్రస్తుతం అలాంటి ఓ మహిళ వార్తల్లో నిలుస్తోంది. ఈ మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి ప్రజలను ఆశ్చర్యపరిచింది. తన టిక్‌టాక్ ఖాతాలో ఆహారానికి సంబంధించిన క్లిప్‌ను అప్‌లోడ్ చేసింది. దానిని చూసిన నెటిజన్లు తమ కళ్లను నమ్మలేకపోయారు.
ఆ మహిళ నూడుల్స్ తింటున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు, ఇది సాధారణ విషయమే. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నూడుల్స్ తింటారు. కానీ వీడియోలో కనిపిస్తున్న మహిళ తినే విధానం ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఆ మహిళ నాలుకను బయటకు రెండు భాగాలుగా తీసి ఆ న్యుడిల్స్ ను పట్టుకుని మరీ విలక్షణంగా తినడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ వీడియోలో యువతి నాలుకను ఇలా రెండు భాగాలుగా ఉంది. ఆమె తినే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఎవరూ ఎప్పుడూ ఊహించి కూడా ఉండరు.
వీడియో చూడండి
View this post on Instagram
Ladbible అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ఈ యువతి తన శరీర మార్పు కథను పంచుకుంది . బాడీ మోడిఫికేషన్ ఆర్టిస్ట్ తన నాలుకను రెండుగా కట్ చేసి.. కుట్లు వేయించుకున్నట్లు చెప్పింది. నాలికను ఇలా రెండుగా కట్ చేసే ప్రక్రియ తాను ఊహించిన దానికంటే చాలా సులభమైందని.. దీనికి కేవలం 15 నిమిషాలు పట్టిందని ఆమె చెప్పింది.
ఆపరేషన్ తర్వాత తన నోటి నుండి లాలాజలం వరదలా ప్రవహించడం ప్రారంభించిందని.. నాలుక్కి కూడా వాపు వచ్చిందని మహిళ తెలిపింది. 24 గంటల తర్వాత తన నాలిక నొప్పి నుండి ఉపశమనం లభించిందని పేర్కొంది. అయితే ఇప్పటికీ తన దంతాలు లాగుతున్నట్లు ఫీల్ అవుతున్నానని.. అంతేకాదు నోరు మూసుకునే సమయంలో కొంత సమస్య ఏర్పడుతుందని పేర్కొంది. అయితే కానీ ఇప్పుడు ఆమెకు తినడానికి, త్రాగడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. తాను ఏదైనా సులభంగా తింటున్నానని.. త్రాగుతున్నానని చెపింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..