Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Shock Child: ప్రమాదవశాత్తు పిల్లలు విద్యుదఘాతానికి గురైతే వెంటనే ఇలా చేయండి.. తప్పక తెలుసుకోండి..

Electric Shock Child: పిల్లలు సహజంగానే ప్రతి అంశంపై ఆసక్తిని కలిగి ఉంటారు. చుట్టుపక్కన వస్తువులను తాకడానికి, వాటితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంట్లో ఫర్నీచర్, గోడలపై ఉండే స్విచ్‌లు, సాకెట్లు, వైరింగ్ మొదలైన వాటిని పదే పదే టచ్ చేస్తుంటారు. వారిని వారించిన వినకుండా.. వాటితో ఆడుకోవడానికి ట్రై చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఇది ప్రమాదకరంగా మారుతుంది. పిల్లులు విద్యుదఘాతానికి గురవుతారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక అవస్థలు పడుతుంటారు.

Electric Shock Child: ప్రమాదవశాత్తు పిల్లలు విద్యుదఘాతానికి గురైతే వెంటనే ఇలా చేయండి.. తప్పక తెలుసుకోండి..
Child Health
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 22, 2023 | 3:50 PM

Electric Shock Child: పిల్లలు సహజంగానే ప్రతి అంశంపై ఆసక్తిని కలిగి ఉంటారు. చుట్టుపక్కన వస్తువులను తాకడానికి, వాటితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంట్లో ఫర్నీచర్, గోడలపై ఉండే స్విచ్‌లు, సాకెట్లు, వైరింగ్ మొదలైన వాటిని పదే పదే టచ్ చేస్తుంటారు. వారిని వారించిన వినకుండా.. వాటితో ఆడుకోవడానికి ట్రై చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఇది ప్రమాదకరంగా మారుతుంది. పిల్లులు విద్యుదఘాతానికి గురవుతారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక అవస్థలు పడుతుంటారు. భయాందోళనకు గురవుతారు. అయితే, ప్రమాదవశాత్తు పిల్లలకు కరెంట్ షాక్ కొడితే.. కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలంటున్నారు నిపుణులు. ఆ మేరకు కొన్ని సూచనలు చేస్తున్నారు. మరి పిల్లలు విద్యుత్ షాక్ తగిలితే వెంటనే ఏం చేయాలి? పిల్లల ప్రాణాలను ఎలా కాపాడాలి? ప్రమాద తీవ్రతను ఎలా తగ్గించాలి? కీలకమైన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పిల్లలు విద్యుదఘాతానికి గురవకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. పవర్ సప్లయ్‌ని నిలిపివేయాలి..

విద్యుత్ షాక్‌కు గురైన సందర్భంలో మొదటి, అతి ముఖ్యమైన అంశం వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. స్విచ్ ఆఫ్ చేయాలి. వీలైతే మీటర్ బోర్డ్ నుంచి మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. వీలైతే మీటర్ బోర్డ్ నుంచి మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. కరెంట్ ఆపేయడం వల్ల ఇతర వ్యక్తులకు ప్రమాదం తగ్గడంతో పాటు.. వారు కూడా కరెంట్‌ షాక్ బారిన పడకుండా ఉంటారు.

2. పిల్లలను కరెంట్ షాక్ నుంచి బయటకు లాగండి..

పిల్లలకు ఒకవేళ విద్యుత్ షాక్ తగిలితే.. వెంటనే వారిని ఆ షాక్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేయండి. రబ్బర్ షూ, ప్లాస్టిక్ రాడ్, పొడి చెక్క సహాయంతో వారిని కరెంట్ వైర్, ప్లగ్ నుంచి దూరం చేయండి. ఇవి ఇంట్లో అందుబాటులో లేకుంటే.. క్లాత్, టవల్ మొదలైన వాటి సహాయంతో పిల్లలను మీరు తాకకుండానే వారిని రక్షించొచ్చు. కరెంట్ షాక్‌కు గురైన బాధితులను నేరుగా మీ చేతులతో పట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఇది మీరు కూడా షాక్‌కు గురయ్యేలా చేస్తుంది.

శివువును వెచ్చగా ఉంచాలి..

కరెంట్ షాక్‌కు గురైన శిశువు శరీరం వేడిగా ఉండేలా చర్యలు చేపట్టాలి. వారికి సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే విద్యుత్ షాక్ వల్ల శరీరంలో శక్తి పూర్తిగా నశించిపోతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత పడిపోతుంది. అందుకే విద్యుత్ షాక్‌కు గురైన పిల్లల శరీరం వెచ్చగా ఉంచడం ద్వారా శరీరాన్ని స్థిరమైన ఉష్ణోగ్రతకు తీసుకురావడం చాలా ముఖ్యం. పిల్లలను వెచ్చని దుస్తులతో చుట్టేయాలి. ఒడిలో తీసుకుని వారి శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

శుభ్రమైన నీటితో పిల్లల శరీరాన్ని తుడవాలి..

విద్యుత్ షాక్‌కు గురైన పిల్లల శరీరంపై ఎలాంటి ఔషధం గానీ, కట్లు గానీ కట్టొద్దు. శుభ్రమైన నీటితో శరీరాన్ని క్లీన్ చేయాలి.

తక్షణ వైద్యం..

విద్యుత్ షాక్‌కు గురైన పిల్లలను తక్షణమే ఆస్పత్రికి తరలించాలి. వెంటనే వైద్యులకు చూపించడం ద్వారా పిల్లులు ప్రమాదం నుంచి బయటపడతారు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. పిల్లలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే.. వెంటనే వైద్యులును సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..