Horoscope Today: వారి ఆదాయానికి లోటుండదు..! 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

మేషరాశి వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిథున రాశివారికి ఆదాయంలో పెరుగుదలే తప్ప తగ్గుదల ఉండదు. మేష రాశి మొదలుకుని మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాడు (23 సెప్టెంబర్, 2023) దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారి ఆదాయానికి లోటుండదు..! 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 23rd September 2023
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 23, 2023 | 5:02 AM

మేషరాశి వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిథున రాశివారికి ఆదాయంలో పెరుగుదలే తప్ప తగ్గుదల ఉండదు. మేష రాశి మొదలుకుని మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాడు (23 సెప్టెంబర్, 2023) దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంతా మీకు అనుకూలంగానే పూర్తవుతుంది. ప్రస్తుతానికి ఎక్కడా తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆచితూచి అడుగులు వేసే ధోరణి మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి ఆధిపత్యం పెరుగుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబడతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలని స్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పిల్లలు శుభవార్తలు మోసుకొస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయంలో పెరుగుదలే తప్ప తగ్గుదల ఉండదు. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ముందుకు దూసుకు వెడతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కొందరు బంధువుల సహకారంతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవ కాశం ఉంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవా లేదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అష్టమ శని ప్రభావం కారణంగా ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆలస్యంగా లేదా కొద్దిగా మాత్రమే పూర్తవడం జరుగుతుంది. ఇంటా బయటా కొన్ని చిరాకులు ఉన్నప్పటికీ, నిదానంగా బాధ్యతలను నెరవేరుస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కూడా పని భారం పెరిగే అవకాశం ఉంది. ఆదాయం కలిసి వస్తుంది కానీ, సంతృప్తికరంగా ఉండదు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు సామరస్యంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): చదువులు, ఉద్యోగాలకు సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ యానానికి, విదేశాలలో స్థిరపడడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అనుకోకుండా ధన యోగం పడుతుంది. సేవా కార్యక్రమాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ ప్రముఖులతో కలిసి పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఆశిం చిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. అనారోగ్య సమస్యలుండే అవకాశం ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): మరింతగా ఆదాయం పెంచుకోవడం మీద దృష్టి పెడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూ లంగా, లాభదాయకంగా మారుతాయి. కొత్త వ్యాపారాలు లేదా కొత్త పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకా శాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభవార్తలు వింటారు. కొందరు మిత్రు లను ఆర్థికంగా ఆదుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాలు సజావుగానే సాగిపోతాయి కానీ, కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడ తాయి. పిల్లల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు వెడతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. స్వల్ప అనా రోగ్య సమస్యలుండవచ్చు. కొందరు స్నేహితులు, సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరు ద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. సేవా, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజ కీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కూడా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరు గుతుంది. కుటుంబ సమేతంగా కొన్ని ముఖ్యమైన ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రుల వల్ల సమస్యలుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో అధికారులు మీ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో తిప్పట తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు కానీ, దానధర్మాలకు లోటుండదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త కార్య క్రమాలు చేపడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాదు. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, రొటీన్ గా సాగిపోతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలకు మాత్రం సానుకూల స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక శుభ వార్త చెవిన పడు తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఇష్ట మైన కార్యాలు, కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సన్నిహితులతో విందులో పాల్గొం టారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆలయాలు సందర్శిస్తారు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

యానిమల్‌ సినిమా క్యారెక్టర్‌ పై రష్మిక షాకింగ్ కామెంట్స్.. వైరల్.
యానిమల్‌ సినిమా క్యారెక్టర్‌ పై రష్మిక షాకింగ్ కామెంట్స్.. వైరల్.
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
"2 రోజుల్లోనే ఏం చేశారని మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లు ఏం చేశారు"
లోగొట్టు ఎవరికి ఎరక.? మహేష్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో..
లోగొట్టు ఎవరికి ఎరక.? మహేష్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో..
రేవంత్‌ సీఎం.. రామ్ చరణ్‌ రియాక్షన్ ఇదే.! ట్వీట్ వైరల్.
రేవంత్‌ సీఎం.. రామ్ చరణ్‌ రియాక్షన్ ఇదే.! ట్వీట్ వైరల్.
రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు