Weekly Horoscope: వారికి ఈ వారం హ్యాపీగా గడిచిపోతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Astro Predictions: మేష రాశి వారికి ఈ వారమంతా దాదాపు ప్రశాంతంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కొన్ని ముఖ్య మైన సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సెప్టెంబర్ 24 నుంచి 30, 2023 వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope: వారికి ఈ వారం హ్యాపీగా గడిచిపోతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
వారఫలాలు (సెప్టెంబర్ 24 నుంచి 30, 2023 వరకు)
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 24, 2023 | 4:01 AM

వారఫలాలు (సెప్టెంబర్ 24 నుంచి 30, 2023 వరకు): మేష రాశి వారికి ఈ వారమంతా దాదాపు ప్రశాంతంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కొన్ని ముఖ్య మైన సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథునరాశి వారికి రెండు శుభ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తి అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సెప్టెంబర్ 24 నుంచి 30, 2023 వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ వారమంతా దాదాపు ప్రశాంతంగా గడిచిపోతుంది. లాభ స్థానంలో శనీశ్వరుడు బాగా బలంగా ఉన్న కారణంగా ఈ రాశివారికి ఆదాయం వృద్ధి ఉంటూనే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదా అధికారం లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. తండ్రి తరఫున ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారా లను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు చదువుల్లో, ఆటలో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కొన్ని ముఖ్య మైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఒకటి రెండు సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ముందుకు వెడతాయి. కొత్త ఆదాయ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కష్టార్జితాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. వృథా ఖర్చు లకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సరైన ప్లానింగ్ మీద దృష్టి పెట్టడం మంచిది. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో చక్కని విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రెండు శుభ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తి అవుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, ప్రయత్నాల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో మెప్పిం చడం జరుగుతుంది. వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు చదువులు, పరీక్షల్లోనూ ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశిలో ఉన్న శుక్రుడు, ధన స్థానంలో ఉన్న బుధుడు ఆర్థిక వ్యవహారాలను చక్కబరుస్తారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంది. కుటుంబ సంబంధమైన విష యాలు సానుకూలంగా సాగిపోతాయి. తృతీయ స్థానంలో ఉన్న రవి, కుజుల వల్ల వృత్తి, ఉద్యో గాల్లో మంచి పురోగతి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే, ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. నాలుగవ స్థానంలో ఉన్న కేతువు కారణంగా స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు హ్యాపీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): భాగ్య స్థానంలో ఉన్న గురువు కారణంగా అనేక వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులు అనుకూలంగా ఉంటారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉన్న బుధుడి కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సప్తమంలో ఉన్న శని వల్ల ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. వృథా ఖర్చులు, అనవసర పరిచయాల కారణంగా ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ భాగస్వామికి భారీగా కానుకలు కొనిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గ్రహ సంచారం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, లాభ స్థానంలో ఉన్న శుక్ర గ్రహం కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొన్ని శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా కూడా కొద్దిపాటి పురోగతి ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చాలావరకు చేతికి అందు తుంది. రుణ సమస్యల ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే సాధారణ ఉద్యోగం లభించ వచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం వల్ల వారమంతా ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది. సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆశించిన ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ స్థానంలో బుధుడు, లాభ స్థానంలో రవి, కుజులు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా పురోగతి ఉంటుంది. అన్ని విధాలుగానూ రాబడి పెరుగుతుంది. ధన కారకుడు, ధనాధిపతి అయిన గురువు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల ధన నష్టానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. తల్లితండ్రుల కారణంగా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. విద్యార్థులకు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి కూడా చాలావరకు తగ్గిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ నిర్ణయాలు, వ్యూహాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యాపారాల తీరుతెన్నులు మారిపోయే అవకాశం ఉంది. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. విదేశాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. సరైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానం, భాగ్య స్థానం పటిష్టంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అద నపు రాబడి కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్లాన్లు వేసుకుం టారు. కుటుంబసమేతంగా విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ, ఉపాధి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల ప్రతి పనీ ఆలస్యం కావడం, వాయిదా పడడం, ఏ ప్రయత్నమూ ముందుకు సాగకపోవడం వంటివి జరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాల్లో కూడా అవాంతరాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. రొటీన్ వ్యవహారాలు తప్ప కొత్త వ్యవహారాలేవీ సాను కూలంగా సాగే అవకాశం ఉండదు. వేచి చూసే ధోరణి మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు ఎంత శ్రమపడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఏ ప్రయత్నం చేసినా, ఏ నిర్ణయం తీసుకునే ఆశించిన స్థాయిలో సఫలం అయ్యే అవకాశం ఉంది. పిల్లల నుంచి, జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి విషయంలో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. దీర్ఘకాలిక రుణాల నుంచి, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ