వైద్య విద్యార్థులకు గొప్ప శుభవార్త చెప్పిన కేంద్రం.. ఇకపై విదేశాల్లో వైద్యం చేయొచ్చు.. పీజీ కోర్సుల్లోనూ చేరొచ్చు…

ప్రస్తుతం దేశంలో ఉన్న రాబోయే పదేళ్లలో ఏర్పాటయ్యే వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ ఎమ్‌ఈ గుర్తింపు పొందుతాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో అన్ని మెడికల్ కాలేజీలు ప్రయోజనం పొందుతాయి. ప్రస్తుతం దేశంలో 706 వైద్య కళాశాలలు ఉండగా, దేశంలో ఏ కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించినా..

వైద్య విద్యార్థులకు గొప్ప శుభవార్త చెప్పిన కేంద్రం.. ఇకపై విదేశాల్లో వైద్యం చేయొచ్చు.. పీజీ కోర్సుల్లోనూ చేరొచ్చు...
Doctors
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 22, 2023 | 11:45 AM

భారతదేశంలోని వైద్య విద్యార్థులకు ఇదో పెద్ద శుభవార్త.. మన వైద్య విద్యార్థులు ఇప్పుడు విదేశాలలో కూడా ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం లభించింది. నేషనల్ మెడికల్ కమీషన్ ఆఫ్ ఇండియా (NMC) 10 సంవత్సరాల పాటు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (WFME) గుర్తింపు హోదాను పొందింది. దీంతో మన దేశంలో డిగ్రీతో, వారు US, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఇతర దేశాలలో రోగులకు చికిత్స చేయగలరు. దీనివల్ల మన దేశంలో వైద్య విద్య ప్రమాణాలు మరింత పెరగడంతో పాటు భారతీయ వైద్యులు కూడా ప్రపంచ స్థాయిలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ మేరకు 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

ప్రస్తుతం దేశంలో ఉన్న రాబోయే పదేళ్లలో ఏర్పాటయ్యే వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ ఎమ్‌ఈ గుర్తింపు పొందుతాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో అన్ని మెడికల్ కాలేజీలు ప్రయోజనం పొందుతాయి. ప్రస్తుతం దేశంలో 706 వైద్య కళాశాలలు ఉండగా, దేశంలో ఏ కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించినా, అవి స్వయంచాలకంగా గుర్తింపు పొందుతాయి. దీన్ని పదేళ్లపాటు వినియోగించుకోవచ్చు. దీంతో వైద్య విద్యార్థులు కూడా ఈ ప్రయోజనం పొందుతారు. ఈ గుర్తింపు వల్ల భారతీయ విద్యార్థులందరూ ఎడ్యుకేషన్ కమీషన్ ఆఫ్ ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కారణంగా, విదేశాల నుండి విద్యార్థులు కూడా భారతదేశంలో చదువుకోవడానికి వస్తారు.. ఎందుకంటే ఇక్కడ డిగ్రీతో, వారు బయట పని చేయవచ్చు.

వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (WFME) నుండి ఈ గుర్తింపు సులభంగా లభించదు. వైద్య సంస్థలు అత్యున్నత అంతర్జాతీయ స్థాయి విద్య, శిక్షణను నిర్వహిస్తే తప్ప ఈ అక్రిడిటేషన్ పొందే అవకాశం లేదు. దీంతో భారత్‌లో విద్యా స్థాయి కూడా పెరిగి ప్రపంచ స్థాయిలో భారత్‌కు కొత్త గుర్తింపు వస్తుంది. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (WFME) ప్రపంచ స్థాయిలో వైద్య విద్య నాణ్యతను పెంపొందించడానికి కట్టుబడి ఉన్న ప్రపంచ సంస్థగా పనిచేస్తుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు… ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య నాణ్యతను మెరుగుపరచడం, వైద్య విద్యలో అత్యున్నత శాస్త్రీయ, నైతిక ప్రమాణాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయడం లక్ష్యంగా WFME కృషి చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..