Ganesh Chaturthi 2023: ఇండిగో విమానంలో దిగొచ్చిన వినాయకుడు.. చేతిలో ఇష్టమైన ప్రసాదంతో భక్తులకు..

గణేష్ నవరాత్రులు అంటే దేశవ్యాప్తంగా సందడే సందడి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు గణనాధులను పూజించేందుకు ఊరేగించేందుకు ఉత్సాహం చూపెడుతుంటారు. గణేశ చతుర్థి రోజున వినాయకుడిని ఇంట్లో పెట్టుకుని మోదక్‌, లడ్డూ వంటి మిఠాయిలు తయారు చేసి ప్రసాదంగా సమర్పించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు గణనాధుడు.

Ganesh Chaturthi 2023: ఇండిగో విమానంలో దిగొచ్చిన వినాయకుడు.. చేతిలో ఇష్టమైన ప్రసాదంతో భక్తులకు..
Lord Ganesh Came By Indigo
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 20, 2023 | 5:14 PM

గణేష్ చతుర్థి ముగిసింది. కానీ, దేశవ్యాప్తంగా గణేష్‌ నవరాత్రుల శోభ సందడి నెలకొంది. ఊరువాడ, పల్లె పట్నం అనే తేడా లేకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల్లో విభిన్నరూపాల్లో గణనాధులు కొలువుదీరి.. భక్తుల పూజలందుకుంటున్నారు. ఇక ప్రతి ఒక్కరి సోషల్ మీడియా ఖాతాలు వినాయకుడి ఫోటోలతో నిండిపోయాయి. ఈలోగా ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా గణేష్ ఉత్సవానికి భిన్నంగా స్వాగతం పలికింది. సోషల్ నెట్‌వర్క్‌లలో ఎప్పుడూ ప్రత్యేక సందర్భాల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈసారి విమానంలో వినాయకుడు వస్తున్న ఫోటోను షేర్ చేసి వినాయక పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

గణేష్ నవరాత్రులు అంటే దేశవ్యాప్తంగా సందడే సందడి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు గణనాధులను పూజించేందుకు ఊరేగించేందుకు ఉత్సాహం చూపెడుతుంటారు. గణేశ చతుర్థి రోజున వినాయకుడిని ఇంట్లో పెట్టుకుని మోదక్‌, లడ్డూ వంటి మిఠాయిలు తయారు చేసి ప్రసాదంగా సమర్పించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు గణనాధుడు. ఈ గణపతి చేతిలో ఉన్న ఒక ప్లేట్‌ నిండా మోదక్‌ పట్టుకుని ఉన్నాడు. విమానంలో సీటుపై కూర్చుని ప్రయాణిస్తూ..హాయిగా తనకెంతో ఇష్టమైన మోదక్‌ తింటున్నట్టుగా చూపించే ఈ ఫోటోను ఇండిగో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా అన్ని ప్లాట్ ఫామ్ లలో వైరల్ అవుతోంది. ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by IndiGo (@indigo.6e)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఫోటో ఇది తెలిసింది. గణపతి బప్పా ఇంటికి వస్తున్నట్లు రాసి ఈ ఫోటోను షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇండిగో ఫ్లైట్ కిటికీ పక్క సీట్లో కూర్చున్న గణేశుడు తన ఒడిలో మోదక్‌ పెట్టుకుని ఉన్నాడు.

ఈ ఫోటో చూసిన చాలా మంది అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆలోచన వెనుక ఎవరున్నారో వారికి నా అభినందనలు అని ఒకరు వ్యాఖ్యానించారు. ఇండిగో ఫ్లైట్ ఫుడ్ మెనూలో మోదకాన్ని చేర్చాలని గణేశుడు విజ్ఞప్తి చేస్తున్నాడని మరొకరు విజ్ఞప్తి చేశారు. మీ ఆలోచన నాకు నచ్చింది అని మరొకరు వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే, మరికొన్ని చోట్ల చంద్రయాన్-3 ఆకారంలో కూడా వినాయక విగ్రహాలు తయారు చేశారు. మండపాల్లో కొలువైన విక్రమ్, రోవర్ వంటి విభిన్న రూపాల్లో  విఘ్నాధిపతిని ప్రతిష్టించుకుని పూజిస్తున్నారు భక్తులు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..