Vizianagaram: శివుడి మెడలో ప్రత్యక్షమైన నాగుపాము.. తండోపతండాలుగా బారులు దీరిన భక్తులు..

Vizianagaram: జిల్లా కేంద్రంలోని వైయస్సార్ నగర్ కాలనీవాసులు అద్భుతమైన గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండపంలో భాగంగా ప్రాంగణంలో చూడముచ్చటగా ఉన్న ఆది దంపతులైన శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.. ఆ విగ్రహాలను చూసేందుకు జిల్లా కేంద్రం నుండి భారీగా తరలి వస్తున్నారు భక్తులు.. అలా వస్తున్న క్రమంలోనే పలువురు భక్తులు..

Vizianagaram: శివుడి మెడలో ప్రత్యక్షమైన నాగుపాము.. తండోపతండాలుగా బారులు దీరిన భక్తులు..
Snake On Lord Shiva Statue
Follow us
G Koteswara Rao

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 20, 2023 | 11:20 AM

విజయనగరం జిల్లా, సెప్టెంబర్ 20: విజయనగరం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితిని పునస్కరించుకొని నవరాత్రులు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. ఊరూ వాడా అని తేడా లేకుండా భక్తులంతా గణేష్ పూజలతో భక్తి పారవశ్యంలో మునిగి పోతున్నారు. విభిన్న రకాల రూపాలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు విఘ్నేశ్వరుడు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు కొద్దిపాటి ఖర్చు నుండి సినీ సెట్టింగ్స్ తలపించేలా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలు కనువిందు చేస్తున్నాయి. వివిధ రూపాల్లో ఉన్న వినాయక విగ్రహాలు, గణేష్ మండపాలను చూసి దేవదేవుని దర్శించుకుంటున్నారు భక్తులు. అలాగే విభిన్న రూపాల్లో ఉన్న గణేష్ మండపాల వద్ద సెల్ఫీలు సైతం తీసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ నగర్ కాలనీవాసులు అద్భుతమైన గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండపంలో భాగంగా ప్రాంగణంలో చూడముచ్చటగా ఉన్న ఆది దంపతులైన శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.. ఆ విగ్రహాలను చూసేందుకు జిల్లా కేంద్రం నుండి భారీగా తరలి వస్తున్నారు భక్తులు.. అలా భక్తులు తరిలి వస్తున్న క్రమంలోనే పలువురు భక్తులు వినాయక దర్శనం అనంతరం బయట ఉన్న శివపార్వతుల దర్శనం చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఓ నాగుపాము శివుడి మెడలో ప్రత్యక్షమైంది.

ఇవి కూడా చదవండి

అసలు ఎక్కడ నుండి వచ్చిందో..? ఎలా వచ్చిందో తెలియదు కానీ పాము మాత్రం శివుడి మెడకు చుట్టుకొని బుసలు కొట్టడం ప్రారంభించింది. దీంతో దర్శనం చేసుకుంటున్న భక్తులు భయంతో పరుగులు తీశారు. తరువాత ఒకింత తమాయించుకొని తిరిగి విగ్రహం వద్దకు చేరుకున్నారు. వినాయక చవితి నవరాత్రుల పర్వదినాన సాక్షాత్తు నాగుపాము శివుడి వద్దకు చేరుకొని మెడలో ప్రత్యక్షమైందని భక్తులు తమ విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో ఆ విషయం ఆ నోటా ఈ నోటా విని మెడలో పాముతో ఉన్న శివపార్వతులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు కూడా చేశారు భక్తులు. అలా కొంత సేపటి తరువాత పాము బుసలు కొట్టడం మరింత ఉదృతం చేసింది. దీంతో భయపడ్డ నిర్వాహకులు స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..