AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare: ముఖంపై బ్లైండ్ పింపుల్స్ ఉన్నాయా..? ఎలాంటి ఖర్చు లేకుండానే సమస్యకు చెక్ పెట్టేయండిలా..

Blind Pimples: చూడడానికి ముఖం కందిపోయినట్లుగా, ఎర్రగా కనిపించే బ్లైండ్ పింపుల్స్ చర్మ సౌందర్యానికి ఆటంకంగానే కాక.. నొప్పిని కలిగించేవిగా ఉంటాయి. సాధారణ మొటిమలు చర్మంపై వస్తే.. బ్లైండ్ పింపుల్స్ చర్మం లోపల పొరపై కనిపిస్తాయి. ఇంకా వీటి కారణంగా చర్మం నిర్జీవంగా కూడా కనిపిస్తుంది. ఇక కొందరు ఈ సమస్య కోసం పలు రకాల కాస్మటిక్స్‌ని ఉపయోగించి నొప్పిని మరింత తీవ్రతరం చేసుకుంటుంటారు. అలాంటి రిస్క్ అవసరం లేకుండా ఇంట్లోనే ఉన్న..

Skincare: ముఖంపై బ్లైండ్ పింపుల్స్ ఉన్నాయా..? ఎలాంటి ఖర్చు లేకుండానే సమస్యకు చెక్ పెట్టేయండిలా..
Blind Pimples
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 18, 2023 | 10:54 AM

Share

Blind Pimples: వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం చాలా మంది ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలతో కూడా బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ముఖంపై కనిపించే సమస్యల్లో మొటిమలు, మచ్చలు ప్రముఖమైనవి. ఇవి కాలక్రమేణా కొద్ది రోజుల్లోనే కనుమరుగైపోతాయి. కానీ కొందరి ముఖంపై కనిపించే బ్లైండ్ పింపుల్స్ దీర్ఘకాలం పాటు అలాగే ఉంటాయి. చూడడానికి ముఖం కందిపోయినట్లుగా, ఎర్రగా కనిపించే ఈ బ్లైండ్ పింపుల్స్ చర్మ సౌందర్యానికి ఆటంకంగానే కాక.. నొప్పిని కలిగించేవిగా ఉంటాయి. సాధారణ మొటిమలు చర్మంపై వస్తే.. బ్లైండ్ పింపుల్స్ చర్మం లోపల పొరపై కనిపిస్తాయి. ఇంకా వీటి కారణంగా చర్మం నిర్జీవంగా కూడా కనిపిస్తుంది. ఇక కొందరు ఈ సమస్య కోసం పలు రకాల కాస్మటిక్స్‌ని ఉపయోగించి నొప్పిని మరింత తీవ్రతరం చేసుకుంటుంటారు. అలాంటి రిస్క్ అవసరం లేకుండా ఇంట్లోనే ఉన్న పదార్థాలను ఉపయోగించుకుని కూడా బ్లైండ్ పింపుల్స్‌ని నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల సమస్య దూరం కావడంతో పాటు దాని మచ్చలు మాయమైపోతాయి.

హీట్ కంప్రెస్: బ్లైండ్ పింపుల్స్‌ని నివారించేందుకు వాటిపై వేడి నీటితో కాపడం పెడితే సరిపోతుంది. అలా చేయడం వల్ల బ్లైండ్ పింపుల్స్‌లోని చీము లాంటి ద్రవం తొలగిపోవడంతో పాటు చర్మం లోపలి రంధ్రాలు తెరచుకుంటాయి. ఇలా 10 నుండి 15 నిమిషాల పాలు చేయడం వల్ల ఫలితాలు లభిస్తాయి.

తేనె: తేనేలో ఎన్నో రకాల యాంటీ మైక్రోబియల్ గుణాలు, విటమిన్ సి, విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొటిమల వల్ల వచ్చే వాపులను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం మీరు బ్లైండ్ పింపుల్స్ ఉన్న ప్రదేశంలో కొద్దిగా తేనె రాస్తే చాలు. అలా చేసిన అరగంట తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

ఇవి కూడా చదవండి

కలబంద: కలబంద చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా కలబందలో హీలింగ్ గుణాలు ఉన్నాయి. ఫలితంగా కలబందను మొటిమలు లేదా బ్లైండ్ పింపుల్స్ మీద అప్లై చేస్తే చాలు, రెండు రోజుల్లోనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

కొబ్బరి నూనె: చర్మ సంరక్షణ కోసం ఎన్నో వందల సంవత్సరాల నుంచి కొబ్బరి నూనె వినియోగంలో ఉంది. జుట్టుకు, చర్మానికి మేలు చేసే ఎన్నో పోషకాలు కలిగిన కొబ్బరి నూనె బ్లైండ్ పింప్పుల్స్‌ని కూడా నివారిస్తుంది. ఇందుకోసం కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, చల్లారిన తర్వాత మొటిమలపై అప్లై చేస్తే చాలు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..