Vastu Tips: పర్సులో ఈ వస్తువులు ఉంటే దరిద్ర దేవతను ఇంట్లో పెట్టుకున్నట్లే.. జాగ్రత్త పడకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం..

Vastu Tips: పర్సు అనేది డబ్బులను దాచుకునే స్థలం, అంటే లక్ష్మీ దేవి నివసించే నివాసం. ఈ కారణంగానే పర్సులో ఏ వస్తువులను పడితే వాటిని పెట్టుకోకూడదు. అలా  పెట్టడం వల్ల అదృష్టానికి బదులు దురదృష్టం పెరుగుతుందని, అప్పులు భారం, కుటుంబ కలహాలు కలుగుతాయని వాస్తు నిపుణులు  చెబుతున్నారు. ఈ క్రమంలో పర్సులో ఏయే వస్తువులను ఉంచకూడదో ఇప్పుడు..

Vastu Tips: పర్సులో ఈ వస్తువులు ఉంటే దరిద్ర దేవతను ఇంట్లో పెట్టుకున్నట్లే.. జాగ్రత్త పడకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం..
Purse Vastu
Follow us

|

Updated on: Sep 16, 2023 | 2:05 PM

Vastu Tips: ప్రస్తుతం పనులన్నీ డిజిటల్ లావాదేవీల్లోనే పూర్తయిపోతున్నాయి. అయినప్పటికీ చాలా మంది పర్సు వాడుతుంటారు. ఇక ఈ పర్సులో డబ్బులు, కాయిన్స్, వివిధ బిల్లులు, ఫోటోలను ఉంచుతారు. అయితే వాస్తు ప్రకారం పర్సులో కొన్ని రకాల వస్తువులు ఉండడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే పర్సు అనేది డబ్బులను దాచుకునే స్థలం, అంటే లక్ష్మీ దేవి నివసించే నివాసం. ఈ కారణంగానే పర్సులో ఏ వస్తువులను పడితే వాటిని పెట్టుకోకూడదు. అలా  పెట్టడం వల్ల అదృష్టానికి బదులు దురదృష్టం పెరుగుతుందని, అప్పులు భారం, కుటుంబ కలహాలు కలుగుతాయని వాస్తు నిపుణులు  చెబుతున్నారు. ఈ క్రమంలో పర్సులో ఏయే వస్తువులను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా మీ పర్స్‌లో పాత బిల్లు పెట్టుకోకూడదు. ఇవి మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారేలా చేస్తాయంట. అనవసరమైన వస్తువులను డబ్బులను దాచుకునే స్థలంలో లేదా పర్సులో ఉంచితే శ్రీమహాలక్ష్మికి అసంతృప్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో పాత బిల్లులు కూడా వ్యర్థపదార్థాలే కనుక వాటిని వెంటనే తీసివేయండి.
  2. జీవించి ఉన్న లేదా చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఎప్పుడూ పర్సులో ఉంచుకోకూడదు. వాస్తు ప్రకారం పర్సులో ఎప్పుడూ ఏ దేవుడి బొమ్మను కూడా ఉంచకూడదు. ఈ విధమైన ఫోటోలు, చిత్రాలను పర్సులో ఉంటే అశుమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మీకు అప్పుల బాధలు కూడా కలుగుతాయని, లక్ష్మీ దేవి నివాస స్థలంలో ఇతరులు ఉండడం మంచిది కాదని వారు పేర్కొంటున్నారు.
  3. పర్సులో డబ్బును ఎప్పుడూ చిందర వందరగా దాచుకోకూడదు. పర్సులో డబ్బును సవ్యంగా అంటే కాగితాలు, నాణేలు వేరువేరుగా ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిదంట.
  4. వాస్తుశాస్త్రం ప్రకారం పర్సులో ఇంటి, వెహికిల్ కీలను కూడా ఎప్పుడూ ఉంచుకోకూడదు. కీలను పర్సులో ఉంచుకోవడం వ్యక్తి జీవితంలో పేదరికానికి దారితీస్తుంది. కాబట్టి పొరపాటున కూడా మీ పర్సులో కీలను ఎప్పుడూ ఉంచుకోకండి. కీని ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయని నిపుణులు అంటున్నారు.
  5. వాస్తుశాస్త్రం ప్రకారం, చిరిగిన నోట్లను ఎప్పుడూ పర్సులో ఉంచుకోకూడదు. మీ పర్స్‌లో ఇదివరకే చిరిగిన నోటు ఉంటే దాన్ని వెంటనే తీసేయండి.  చిరిగిన పర్సును కూడా ఉపయోగించకూడదు. చిరిగిన పర్సును ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందంట.
  6. వాస్తు ప్రకారం, అప్పుగా తీసుకున్న డబ్బును కూడా పర్సులో ఎప్పుడూ ఉంచుకోకూడదు. అప్పుగా తీసుకున్న డబ్బును పర్సులో ఉంచుకుంటే అప్పుల భారం పెరిగి ఆర్థికంగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.