AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: రేపటి నుంచి ఈ రాశులవారికి కష్టకాలం.. కన్యారాశిలో సూర్య సంచారం ఎవరెవరికీ నష్టం కలిగిస్తుందంటే..?

Sun Transit in Virgo: సూర్యుడు సెప్టెంబర్ 17న అంటే రేపు ఉదయం 7:11 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఫలితంగా ఓ మూడు రాశుల అదృష్టంపై సూర్యోస్తమయం కలగనుంది. అంటే ఈ సమయంలో ఆయా రాశులవారు గడ్డు కాలాన్ని గడుపుతారు. కష్టాల సంద్రంలో మునిగిపోయిన భావన కలుగుతుంది. ఇంతకీ ఆ రాశులేమిటి..?

Zodiac Signs: రేపటి నుంచి ఈ రాశులవారికి కష్టకాలం.. కన్యారాశిలో సూర్య సంచారం ఎవరెవరికీ నష్టం కలిగిస్తుందంటే..?
Sun Transit In Virgo
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 16, 2023 | 11:30 AM

Share

Sun Transit in Virgo: వైదిక జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని నవ గ్రహాలకు రాజుగా భావిస్తారు. సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే అన్ని పనులు సజావుగా సాగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇంకా సూర్యుడు వేర్వేరు రాశుల్లోకి ప్రవేశించినప్పుడు.. రాశి చక్రంలోని 12 రాశులవారి జాతక చక్రాలపై దాని ప్రభావం పడుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారు అనుకూల ప్రభావాలు, మరొ కొన్ని రాశులవారు ప్రతికూల ప్రభావాలను పొందుతారు. ఈ క్రమంలో సూర్యుడు సెప్టెంబర్ 17న అంటే రేపు ఉదయం 7:11 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఫలితంగా ఓ మూడు రాశుల అదృష్టంపై సూర్యోస్తమయం కలగనుంది. అంటే ఈ సమయంలో ఆయా రాశులవారు గడ్డు కాలాన్ని గడుపుతారు. కష్టాల సంద్రంలో మునిగిపోయిన భావన కలుగుతుంది. ఇంతకీ ఆ రాశులేమిటి..? కన్యారాశిలో సూర్య సంచారం వారికి ఏయే ఫలితాలను కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తులా రాశి: కన్యా రాశిలో సూర్య సంచారం తుల రాశి వారికి ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఈ రాశికి చెందిన వారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగా రాదు, వ్యాపారాల్లో కూడా నష్టం కలుగుతుంది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి చివాట్లు, విమర్శలు పెరుగుతాయి. వైవాహిక బంధంలో కూడా సమస్యలు కలుగుతాయి.

కుంభ రాశి: సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం వల్ల రానున్న 30 రోజులు కుంభ రాశివారికి ప్రతికూల కాలంగా మారనుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. తోబుట్టువులతో వివాదాలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారుతుంది.

ఇవి కూడా చదవండి

మీన రాశి: సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మీన రాశివారికి కష్టాలు మొదలవుతాయి. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో విభేదాలను ఎదుర్కొంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడికి లోనవుతారు. ప్రతి నిర్ణయంలోనూ నిరాశే మిగులుతుంది. మీ నోటి నుంచి మాట రావడమే పాపమన్న పరిస్థితి ఎదుర్కొంటారు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.