Health Benefits: ప్రతి రోజూ తేనె, దాల్చిన చెక్కను కలిపి తీసుకుంటే ఆరోగ్యం, ఆనందం.. ఎన్ని ప్రయోజనాలో..

Health Tips: వంట గదిలోనే ఉండే సుగంధ ద్రవ్యాలను సరిగ్గా ఉపయోగించుకుంటే హాస్పిటల్ అవసరం కాదుగా.. టాబ్లెట్ అవసరం కూడా ఉండదు. ఆరోగ్యాన్ని కాపాడే అలాంటి సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో మెరుగ్గా పనిచేస్తుంది. నిత్యం దీన్ని తేనెలో కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో పాటు సమస్యలు దూరం..

Health Benefits: ప్రతి రోజూ తేనె, దాల్చిన చెక్కను కలిపి తీసుకుంటే ఆరోగ్యం, ఆనందం.. ఎన్ని ప్రయోజనాలో..
Health Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 15, 2023 | 7:24 AM

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే సరిలేని జీవనశైలి, ఆహారపు అలవాట్లతో మనమే చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, ఆ తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందుకోసం నిత్యం తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే వంట గదిలోనే ఉండే సుగంధ ద్రవ్యాలను సరిగ్గా ఉపయోగించుకుంటే హాస్పిటల్ అవసరం కాదుగా.. టాబ్లెట్ అవసరం కూడా ఉండదు. ఆరోగ్యాన్ని కాపాడే అలాంటి సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో మెరుగ్గా పనిచేస్తుంది. నిత్యం దీన్ని తేనెలో కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో పాటు సమస్యలు దూరం అవుతాయి. అసలు దాల్చిన చెక్కను తేనేతో కలిపి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఈ రెండింటినీ కలిపి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

దాల్చిన చెక్క-తేనె యొక్క ప్రయోజనాలు:

1. దాల్చిన చెక్క, తేనె.. రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నందున ఇవి ఫ్రీ రాడికల్స్ దెబ్బ తినకుండా క్యాన్సర్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

2. దాల్చిన చెక్కలోని ఫైబర్ ఉన్నందున ఈ మిశ్రమం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో తేనె కీలకంగా పని చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

3. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచగలిగే సామర్థ్యం కూడా దాల్చిన చెక్క, తేనే మిశ్రమానికి ఉంది. అంటే ఈ మిశ్రమం ద్వారా గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు.

4. తేనె, దాల్చిన చెక్కను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి.. కడుపు నొప్పి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.

5. తేనె, దాల్చిన చెక్క మిశ్రమం మొటిమలను తగ్గించేందుకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందు కోసం  దాల్చిన చెక్క పొడి, మూడు టేబుల్‌ స్పూన్ల తేనె మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసి 15 నిముషాల తర్వాత కడిగితే చాలు.

6. తేనె, దాల్చిన చెక్క మిశ్రమాన్ని ప్రతి రోజూ తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని వైరస్, బ్యాక్టీరియా నశించడమే కాక సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

7. తేనె, దాల్చిన చెక్క మిశ్రమం ఆర్థరైటిస్‌ నొప్పులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఒక టీ స్పూన్‌ తేనె, అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే చాలు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే