PAK vs SL: పాకిస్తాన్ లేదా శ్రీలంక, ఏది బలమైన టీమ్..? వన్డేల్లో ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే నేటి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెప్టెంబర్ 17న భారత్‌తో ఆసియా కప్ ఫైనల్‌ ఆడుతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ని ఎలా అయినా విజయం సాధించాలని ఇరు జట్లు కూడా పట్టుదలతో ఉన్నాయి. అలాగే పాకిస్తాన్‌ vs శ్రీలంక మ్యాచ్‌లో విజేత ఎవరు, భారత్‌తో తలపడేది ఎవరనేది తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే ఇరు జట్ల మధ్య వన్డే రికార్డులు మాత్రం పాకిస్తాన్‌కే అనుకూలంగా..

PAK vs SL: పాకిస్తాన్ లేదా శ్రీలంక, ఏది బలమైన టీమ్..? వన్డేల్లో ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే..?
Pakistan Vs Sri Lanka
Follow us

|

Updated on: Sep 14, 2023 | 7:44 AM

PAK vs SL: ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే సూపర్ 4 రౌండ్‌లో ఈ జట్లలో ఓ జట్టు నేటి మ్యాచ్ ద్వారా ఆసియా కప్ ఫైనల్‌కి చేరుతుంది. సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్‌, శ్రీలంకపై గెలిచిన భారత్ ఇప్పటికే టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. అంటే నేటి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెప్టెంబర్ 17న భారత్‌తో ఆసియా కప్ ఫైనల్‌ ఆడుతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ని ఎలా అయినా విజయం సాధించాలని ఇరు జట్లు కూడా పట్టుదలతో ఉన్నాయి. అలాగే పాకిస్తాన్‌ vs శ్రీలంక మ్యాచ్‌లో విజేత ఎవరు, భారత్‌తో తలపడేది ఎవరనేది తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

అయితే ఇరు జట్ల మధ్య వన్డే రికార్డులు మాత్రం పాకిస్తాన్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వన్డే క్రికెట్‌లో శ్రీలంకపై పాకిస్థాన్‌దే పైచేయి. పాకిస్థాన్, శ్రీలంక మధ్య ఇప్పటి వరకు మొత్తం 155 మ్యాచ్‌లు జరగగా.. 92 మ్యాచ్‌ల్లో పాక్ విజేతగా నిలిచింది. శ్రీలంక జట్టు 58 మ్యాచ్‌లను మాత్రమే గెలుచుకోగా, ఒక మ్యాచ్ డ్రా అయింది. అలాగే 4 మ్యాచ్‌లు ఫలితంగా లేకుండానే ముగిశాయి. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ కొలంబో వాతావరణం మాత్రం తన దేశ జట్టుకే అనుకూలంగా ఉంది. ఎలా అంటే.. నేటి మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఒక వేళ మ్యాచ్ సమయంలో వర్షం పడి ఆట రద్దయితే.. నెట్ రన్ రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్‌కి చేరుతుంది. ఎందుకంటే.. శ్రీలంక రన్‌రేట్ (-0.200) పాకిస్తాన్ రన్‌రేట్ కంటే మెరుగ్గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా.. వాతావరణంతో సంబంధం లేకుండా పాకిస్తాన్ జట్టు లంకతో తలపడేందుకు సిద్ధమైంది. ఎలా అయినా లంకను ఓడించి ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారిగా భారత్‌తో ఫైనల్ ఆడాలనే పట్టుదలతో అడుగులు వేస్తోంది. ఈ మేరకు శ్రీలంకతో జరిగే నేటి మ్యాచ్ కోసం ముందుగానే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది.

నేటి మ్యాచ్ కోసం ఇరుజట్ల ప్లేయింగ్ ఎలెవన్:

పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ హారీస్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, షాహీన్ ఆఫ్రిది, జమాన్ ఖాన్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.