SL vs PAK: కీలక పోరులో శ్రీలంక, పాక్ ఢీ.. గెలిచినవారికి భారత్‌తో ఫైనల్.. వర్షం పడితే ఈ సారి కూడా ఆ మ్యాచ్ లేనట్లే..!
SL vs PAK: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే నేటి మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరి భారత్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఎలా అయినా విజయం సాధించి ఫైనల్‌కి చేరాలనే యోచనలో ఇరు జట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. రెండు జట్లకు డూ ఆర్ డై..
SL vs PAK: ఆసియా కప్ సూపర్ 4 క్లాష్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు భారత్ ముందు నిలవలేకపోయాయి. ఈ రెండు జట్లపై 228, 41 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్‌కి చేరగా.. మరో విజయం సాధించి, ఫైనల్‌లో టీమిండియాతో ఢీ కొట్టేందుకు పాక్, లంక నేటి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. అంటే కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే నేటి మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరి భారత్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఎలా అయినా విజయం సాధించి ఫైనల్‌కి చేరాలనే యోచనలో ఇరు జట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. రెండు జట్లకు డూ ఆర్ డై అయిన ఈ మ్యాచ్‌కి వర్ఫం ముప్పు కూడా పొంచి ఉండడం గమనార్హం.
Our playing XI for the #PAKvSL match 🇵🇰#AsiaCup2023 pic.twitter.com/lhT5Vl8RtX
ఇవి కూడా చదవండి— Pakistan Cricket (@TheRealPCB) September 13, 2023
ఫైనల్‌కి చేరిన భారత్..
India’s exciting 41-run win last night propelled them into the Asia Cup 2023 finals. Tomorrow, Pakistan and Sri Lanka will vie for the second spot, determining India’s opponent in the championship match! 💪#AsiaCup2023 pic.twitter.com/wuWFNoeRCJ
— AsianCricketCouncil (@ACCMedia1) September 13, 2023
వర్షం పడితే పరిస్థితి ఏంటి..?
ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు ఉంది. ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు భారత్‌తో సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచిన ఈ జట్లను నేటి మ్యాచ్ ద్వారా పాయింట్‌తో కూడా పాయింట్ల పట్టికతో సమానంగా ఉంటాయి. అయితే నెట్ రన్‌రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్‌కి చేరుతుంది. సూపర్ 4లో పాకిస్తాన్ రన్‌రేట్ (-1.892) కంటే లంక రన్‌రేట్ (-0.200) మెరుగ్గా ఉండడమే ఇందుకు కారణం. ఇదే జరిగితే ఈ ఆసియా కప్ టోర్నీలో కూడా భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ లేనట్లే అవుతుంది. ఒక వేళ నేటి మ్యాచ్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిస్తే.. ఆసియా కప్ చరిత్రలోనే తొలి సారిగా ఫైనల్ మ్యాచ్ భారత్, పాక్ మధ్య జరుగుతుంది.
ఇరుజట్ల ప్లేయింగ్ ఎలెవన్:
పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ హారీస్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, షాహీన్ ఆఫ్రిది, జమాన్ ఖాన్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.