Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కోతుల బెడద నివారణకు ఉన్నతాధికారులతో సీఎస్‌ శాంతికుమారి సమీక్ష.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా..

ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కోతుల కారణంగా రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వ్యూహ రచన చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తదితర ఉన్నతాధికారుల..

Telangana: కోతుల బెడద నివారణకు ఉన్నతాధికారులతో  సీఎస్‌ శాంతికుమారి సమీక్ష.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా..
Chief Secretary Santhi Kumari
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 12, 2023 | 11:32 AM

తెలంగాణ, సెప్టెంబర్ 12: ఇటీవలి కాలంలో కోతిమూకల బెదడ ఎక్కువైపోయింది. ముఖ్యంగా వ్యవసాయ పొల్లాలో వీటి కారణంగా కలుగుతున్న పంట నష్టం కారణంగా రైతన్నలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కోతుల బెడద నివారణ కోసం చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో సోమవారం సచివాలయంలోని ఇంటర్ డిపార్ట్‌మెంట్, ఇంటర్ ఏజెన్సీల సమన్వయ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కోతుల వల్ల పంట నష్టం వాటిల్లకుండా వ్యూహ రచన చేయడమే లక్ష్యంగా, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఇక ఈ సమావేశంలో కోతుల కారణంగా రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వ్యూహ రచన చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తదితర ఉన్నతాధికారుల మధ్య జరిగిన ఈ సమావేశంలో.. కోతుల బెడద నియంత్రణకు స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా తీసుకోదగిన వివిధ చర్యలను ఎక్పర్ట్ కమిటీ సభ్యులు ప్రతిపాదించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ  క్లిక్  చేయండి..