- Telugu News Photo Gallery Follow these home remedies to get rid of Unwanted Facial Hair without pain
Facial Hair: ముఖంపై అవాంఛిత రోమాలా..? నొప్పి లేకుండా, ఇంట్లోనే తొలగించుకోండిలా..
Skincare Tips:చాలా మంది మహిళలు ముఖంపై అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతుంటారు. వాటిని తొలగించుకోవడం కోసం పలు రకాల కాస్మిటిక్స్, వాక్సింగ్ లేదా థ్రెడింగ్‌ని ఉపయోగిస్తూ తాము చేస్తోంది వృథా ప్రయాస అని తెలుసుకొని సమస్యతోనే సర్దుకుపోతుంటారు. శరీరంలో హార్మోన్స్ అసమతుల్యత, పీసీఓడీ సమస్యల కారణంగా ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలకు కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తే సమస్యను నియంత్రించవచ్చని పలువురు బ్యూటిషీయన్స్ చెబుతున్నారు. ఇంతకీ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 10, 2023 | 8:00 PM

పండిన బొప్పాయి ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇందు కోసం మీరు పండిన బొప్పాయిని మెత్తగా నూరి, అందులో కొద్దిగా తేనె లేదా పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి, ఓ 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. రెండు వారాల పాటు.. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి మీరు నిమ్మకాయ రసం, చక్కెర మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇందు కోసం కొద్దిగా చక్కెరను నిమ్మరసంలో కలిపి పేస్ట్‌ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసి, ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

మీరు అవాంఛిత రోమాలను తొలగించడానికి బియ్యం పిండిని కూడా ఉపయోగించవచ్చు. ఇందు కోసం బియ్యం పిండిలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు స్క్రబ్ చేయండి. తర్వాత సాధారణ నీటితో మీ ముఖాన్ని కడగాలి.

ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి మీరు శనగపిండి, పెరుగును కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం పెరుగు, శెనగపిండిని కలిపి పేస్ట్‌లా తయారు చేసి, దానికి చిటికెడు పసుపు జోడించండి. తర్వాత ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. పేస్ట్ ముఖంపై పొడిగా మారినప్పుడు నీటితో శుభ్రం చేయండి.

ముఖంపై వెంట్రుకలను మీరు పాలు, పసుపుతో కూడా తొలగించుకోవచ్చు. ఇందుకోసం రెండు చెంచాల పాలలో రెండు చిటికెల పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల పాటు ముఖం మీద ఉంచి, ఆపై సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలకు స్వస్తి పలకవచ్చు.





























