- Telugu News Photo Gallery Cricket photos Ind vs pak Indian captain rohit sharma special record of most matches as opener for team india in asia cup 2023
IND vs PAK: కొలంబోలో రోహిత్ ‘ట్రిపుల్ సెంచరీ’.. సెహ్వాగ్ స్పెషల్ జాబితాలో చోటు.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?
Rohit Sharma Records: ఆసియా కప్ 2023లో భారత్-పాకిస్థాన్ మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ ఫోర్‌లో భాగంగా 3వ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. భారత్ తరపున ఓపెనర్‌గా సచిన్ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ గాడ్ 346 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ లిస్టులో వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు.
Updated on: Sep 10, 2023 | 6:32 PM

Rohit Sharma Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భారత్-పాకిస్థాన్ మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ ఫోర్‌లో భాగంగా 3వ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా భారత్ తరపున హిట్‌మ్యాన్ 300 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించిన ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు. భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట నిలిచింది.

భారత్ తరపున ఓపెనర్‌గా రోహిత్ తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడుతున్నాడు. ఇంతకుముందు ఓపెనర్‌గా 299 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు 300వ మ్యాచ్ ఆడుతున్నాడు. నంబర్ వన్ బ్యాటింగ్‌లో రోహిత్ 9870 పరుగులు చేశాడు. రెండో ర్యాంక్‌లో బ్యాటింగ్ చేస్తూ 3496 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటివరకు 39 సెంచరీలు సాధించాడు.

భారత్ తరపున ఓపెనర్‌గా సచిన్ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ గాడ్ 346 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

ఈ లిస్టులో వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ 321 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రోహిత్ 3వ స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ 268 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 4వ స్థానంలో నిలిచాడు.




