- Telugu News Photo Gallery Cricket photos David Warner breaks Sachin Tendulkar's unique record during SA vs AUS 2nd ODI
David Warner: సరికొత్త రికార్డ్ సృష్టించిన వార్నర్ మామ.. సచిన్ సెంచరీలకు బ్రేక్.. ఆ మార్పుతో బరిలోకి..
David Warner: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో విజృంభించాడు. 93 బంతుల్లోనే 3 భారీ సిక్సర్లు, 12 ఫోర్లతో 106 పరుగులతో క్రికెట్ చరిత్రలో లేని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సెంచరీ రికార్డును కూడా వార్నర్ బద్దలు కొట్టడం విశేషం. ఇంతకీ వార్నర్ బ్రేక్ చేసిన ‘సచిన్ సెంచరీ’ రికార్డు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 09, 2023 | 9:33 PM

ఆస్ట్రేలియా ఓపెనర్‌గా మూడు ఫార్మాట్లలోనూ ఎన్నో రికార్డులను తిరగరాసిన వార్నర్.. సౌతాఫ్రికాపై సెంచరీ చేసి సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేయడంతో పాటు కొత్త రికార్డ్ సృష్టించాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా ఓపెనర్‌గా మొత్తం 45 సెంచరీలు చేశాడు. ఇప్పుడు వార్నర్ ఆ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలోకి చేరాడు.

డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా మొత్తం 46 సెంచరీలు సాధించాడు. ఇందులో 20 వన్డే, 25 టెస్టు, 1 టీ20 సెంచరీ ఉన్నాయి. తద్వారా 45 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న సచిన్‌ని అధిగమించి, ఆ స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు వార్నర్ మామ.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్ 46 సెంచరీలు, సచిన్ టెండూల్కర్ 45 సెంచరీలతో తొలి రెండు స్థానాల్లో ఉండగా.. క్రిస్ గేల్ 42 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.

అలాగే నాలుగో స్థానంలో సనత్ జయసూర్య (41), ఐదో స్థానంలో మాథ్యూ హెడేన్(40) ఉండగా... భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనరగా 39 సెంచరీలు చేసి ఆరో స్థానంలో ఉన్నాడు.




