IND vs PAK: కోహ్లీ రికార్డ్‌ను సమం చేసిన కేఎల్ రాహుల్.. ఆ ఘనత సాధించి, ధావన్ లిస్టులో మూడో ప్లేయర్‌గా..
Asia Cup 2023: భారత్, పాక్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ నేటికి రద్దు చేయబడింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారీ వర్షం అడ్డురావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. కొంత సేపటికి వర్షం ఆగినా.. మైదానం తడిగా ఉండడం, మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండడంతో అంపైర్లు ఆటను నేటికి వాయిదా వేశారు. మిగిలిన మ్యాచ్ రేపు కొనసాగుతుంది. అంతకముందు పాకిస్తాన్‌పై 17* పరుగులతో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద..
IND vs PAK: ఆసియా కప్ టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున 2000 వన్డే పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు.. ఈ మైలు రాయిని అత్యంత వేగంగా చేరుకున్న మూడో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్‌ను కేఎల్ రాహుల్ సమం చేశాడు. విరాట్ కోహ్లీ 53 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులను పూర్తి చేసుకోగా.. కేెఎల్ రాహుల్ కూడా 53 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న నేటి మ్యాచ్‌లో 17* పరుగులతో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 2000 వన్డే పరుగులను పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 2000 వన్డే పరుగులను పూర్తి చేసుకున్న ప్లేయర్లుగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ధావన్ 48 ఇన్నింగ్స్‌ల్లోనే 2000 వన్డే పరుగులను పూర్తి చేసుకొని ప్రథమ స్థానంలో ఉండగా.. 52 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో సమంగా ఉన్నారు.
2000 ODI runs and counting for @klrahul 🙌
ఇవి కూడా చదవండిLive – https://t.co/Jao6lKkWs5… #INDvPAK #AsiaCup2023 pic.twitter.com/We2YfX06gA
— BCCI (@BCCI) September 10, 2023
టాప్ 5 ప్లేయర్లు..
Fastest to 2000 ODI Runs for India- (innings)
48 – Shikhar Dhawan 52 – Navjot Singh Sidhu, Sourav Ganguli 53 – KL Rahul, Virat Kohli
Even after playing with postion changes from Opener to No. 5 he is joint fastest to do so🔥#KLRahul pic.twitter.com/NyFiIqGusN
— ᴛʜᴇ ᴜᴘᴀᴅʜʏᴀʏ(вα¢кυρ) (@theUpadhyay_ji) September 10, 2023
ఇదిలా ఉండగా భారత్, పాక్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ నేటికి రద్దు చేయబడింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారీ వర్షం అడ్డురావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. కొంత సేపటికి వర్షం ఆగినా.. మైదానం తడిగా ఉండడం, మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండడంతో నేటికి వాయిదా వేశారు. మిగిలిన మ్యాచ్ రేపు కొనసాగుతుంది.
రేపటికి వాయిదా..
UPDATE – Play has been called off due to persistent rains 🌧️
See you tomorrow (reserve day) at 3 PM IST!
Scorecard ▶️ https://t.co/kg7Sh2t5pM #TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/7thgTaGgYf
— BCCI (@BCCI) September 10, 2023
కాగా, టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలి బ్యాటింగ్‌కు దిగింది. భారత్ తరఫున ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ(56), శుభమాన్ గిల్(58) అర్థశతకాలతో టీమిండియాకు శుభారంభం అందించారు. వారు వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 8, కేఎల్ రాహుల్ 17 పరుగుల వద్ద ఉండగా.. వర్షం అడ్డువచ్చింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.
హిట్ మ్యాచ్ షో..
5⃣0⃣th ODI FIFTY! 🙌 🙌
Captain Rohit Sharma marches past the half-century in 42 balls 👌 👌
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/HDpd0yj16N
— BCCI (@BCCI) September 10, 2023
శుభమాన్ అర్థ సెంచరీ..
He’s on the move & how! 🙌 🙌
A 37-ball FIFTY for Shubman Gill – his second in a row 👏 👏
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/XPP5ZwYswC
— BCCI (@BCCI) September 10, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..