Children’s Diet: పోషాకాహారంతోనే పిల్లల ఆరోగ్యం.. వారి డైట్‌లో ఏయే ఆహారాలు తప్పక ఉండాంటే..?

Children's Healthcare: ఆహారం కారణంగానే పిల్లలో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరు చురుగ్గా ఉంటాయి. ఇంకా వారి శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు లభించి, శక్తివంతంగా ఎదుగుతారు. వారి ఎముకలు కూడా బలోపేతం అవుతాయి. ఎవరికైనా శారీరక వికాసం సాధించేందుకు బాల్యమే కీలక సమయం. ఈ కారణంగా పిల్లలకు వారి బాల్యంలో..

Children's Diet: పోషాకాహారంతోనే పిల్లల ఆరోగ్యం.. వారి డైట్‌లో ఏయే ఆహారాలు తప్పక ఉండాంటే..?
Children's Diet
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 09, 2023 | 10:01 PM

Children’s Health Diet: సంపూర్ణమైన ఆరోగ్యం కోసం అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఆహారం విషయంలో పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎదిగే వయసు కాబట్టి వారి డైట్ ప్లాన్‌లో కొన్ని రకాల ఆహారాలు ఉండడం తప్పనిసరి అని పోషకాహార నిపుణులు, వైద్య నిపుణులు అంటున్నారు. ఆహారం కారణంగానే పిల్లలో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరు చురుగ్గా ఉంటాయి. ఇంకా వారి శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు లభించి, శక్తివంతంగా ఎదుగుతారు. వారి ఎముకలు కూడా బలోపేతం అవుతాయి. ఎవరికైనా శారీరక వికాసం సాధించేందుకు బాల్యమే కీలక సమయం. ఈ కారణంగా పిల్లలకు వారి బాల్యంలో మెరుగైన ఆహారం తప్పనిసరి. మరి పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

గుడ్లు: గుడ్లు ఎన్నో రకాల పోషకాలను పొందేందుకు ఉత్తమ ఎంపిక. ఈ కారణంగా ప్రతి రోజు మీ పిల్లల అల్పాహారంలో గుడ్లు ఉండేలా జాగ్రత్త పడండి. గుడ్లలో కేలరీలు, ప్రోటీన్లు, ఫోలేట్, విటమిన్ బి12, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, కాల్షియం, ఫాస్ఫరస్, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి5 వంటి పలు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

చేపలు: చేపలు గుండెకు మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలకు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి గుండెకే కాక మెదడు పనితీరు మెరుగుపడడానికి, ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లల ఆహారంలో చేపలు ఉండడం వల్ల వారి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

డార్క్ చాక్లెట్: పిల్లలు చాక్లెట్స్‌‌ని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్రమంలో మీరు ఇతర చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్‌ని పిల్లలకు ఇవ్వాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు పిల్లలో ఇమ్యూనిటీని పెంచడంతో పాటు చదువుల వల్ల వచ్చే ఒత్తిడి, ఆందోళనను నియంత్రిస్తాయి.

ఆకుకూరలు: పిల్లల ఆహారంలో ఆకుకూరలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మానవ శరీరానికి చాలా అవసరమైనవి మాత్రమే కాక ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కారణంగా పిల్లల ఆహారంలో పాలకూర, తోట కూర, గోంగూర వంటి ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త వహించండి.

పాలు, పాల ఉత్పత్తులు: పాలకు మించిన పోషకాహారం ఇంకొకటి లేదంటే అతిశయోక్తి లేదు. పాల ద్వారా లభించే విటమిన్స్, మినరల్స్, ప్రోటిన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ క్రమంలో పిల్లల ఆహారంలో పాలతో పాటు పాల ఉత్పత్తులైన పెరుగు, జున్ను, మజ్జిగ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.