AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heath Tips: షుగర్ పేషెంట్లు, గర్భిణీలు టమోటాలను తినొచ్చా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

Tomato for Diabetics, Pregnants: టమోటాలోని ఐరన్, ఇంకా ఇతర పోషకాలు వారి శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఐరన్ రక్తహీనతను నిరోధించి, రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా గర్భిణీలకు గొప్ప మేలు చేస్తుంది. అలాగే టమోటాలోని లైకోపీన్ ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. టమోటాలోని విటమిన్ ఇ కేశ-చర్మ సమస్యలకు, బీటా కెరోటిన్ కంటి సమస్యలకు, విటమిన్ సి సీజనల్ ఇన్ఫెక్షన్లకు, ఫైబర్ జీర్ణ సమస్యలకు..

Heath Tips: షుగర్ పేషెంట్లు, గర్భిణీలు టమోటాలను తినొచ్చా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
Tomato Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 09, 2023 | 4:28 PM

Share

టమోటాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను టమోటాల ద్వారా పొందవచ్చు. టమోటాల్లో విటమిన్ సి, పొటాషియం, ఫొలేట్, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, థయామిన్, నియాసిన్, ఫాస్పరస్, కాపర్, ఐరన్, ప్రోటిన్, కేలరీలు, కార్బోహైడ్రేట్లు సహా ఇంకెన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాగే టమోటాలను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, రక్తహీనత సహా అనేక ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే డయాబెటీస్ రోగులు, ఇంకా గర్భధారణ సమయంలో స్త్రీలు టమోటాలను తీసుకోవడం మంచిదేనా అని చాలా మందిలో ఉన్న సర్వసాధారణ అనుమానం. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

నిపుణుల ప్రకారం టమోటాలను డయాబెటిస్, గర్భిణీలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. టమోటాల్లో చక్కెర ఉన్నప్పటికీ రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. పైగా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే గర్భిణీలు కూడా టమోటాలను ఎలాంటి అనుమానాలు లేకుండా తీసుకోవచ్చు. దీనిలోని ఐరన్, ఇంకా ఇతర పోషకాలు వారి శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఐరన్ రక్తహీనతను నిరోధించి, రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా గర్భిణీలకు గొప్ప మేలు చేస్తుంది. అలాగే టమోటాలోని లైకోపీన్ ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. టమోటాలోని విటమిన్ ఇ కేశ-చర్మ సమస్యలకు, బీటా కెరోటిన్ కంటి సమస్యలకు, విటమిన్ సి సీజనల్ ఇన్ఫెక్షన్లకు, ఫైబర్ జీర్ణ సమస్యలకు చెక్ పడుతుంది.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. టమోటాలను కూరగా కంటే నేరుగా పచ్చివి తినడం వల్ల మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నారు. ఈ క్రమంలో కూరగా కంటే పచ్చి టమోటాలను తినేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే టమోటాలను మితంగా తీసుకోవాలని కూడా గమనించాలి. టమోటాల్లో పోషకాలు పుష్కలంగా ఉన్న కారణంగా పరిమితికి మించి తీసుకోవడం ఆరోగ్యం పై దుష్ప్రభావాలకు కారణం కాగలదు.

ఇవి కూడా చదవండి

గమనిక: పై ఆర్టికల్‌లో తెలియజేసిన సమాచారం పాఠాకుల ఆసక్తి మేరకు ఇచ్చినది మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు దృవీకరించడం లేదు. ఏవైనా వైద్య, ఆరోగ్య సూచనలను పాటించే ముందు లేదా సందేహాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..