SL vs BAN: లంకపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఓడితే ఇంటికే.. తుది జట్ల వివరాలివే..

Asia Cup 2023: ఆసియాకప్‌లో సూపర్‌-4 రౌండ్‌లోని 2వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. కొలంబో వేదికగా ప్రేమదాస మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ కోసం టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మేరకు తొలి బ్యాటింగ్ శ్రీలంక జట్టు చేయబోతుంది. ఇదిలా ఉండగా నేటి మ్యాచ్ బంగ్లా జట్టుకు కీలకం. సూపర్ 4 రౌండ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ని పాక్‌తో ఆడిన బంగ్లా..  7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

SL vs BAN: లంకపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఓడితే ఇంటికే.. తుది జట్ల వివరాలివే..
BAN vs SL
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 09, 2023 | 7:10 PM

Asia Cup 2023: ఆసియా కప్‌లో భాగంగా శనివారం జరుగుతోన్న సూపర్‌-4 రౌండ్‌ 2వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ కోసం టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మేరకు దసున్ షనక నేతృత్వంలోని శ్రీలంక జట్టు తొలి బ్యాటింగ్ చేయబోతుంది. ఇదిలా ఉండగా నేటి మ్యాచ్ బంగ్లా జట్టుకు కీలకం. సూపర్ 4 రౌండ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ని పాక్‌తో ఆడిన బంగ్లా.. అందులో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో బంగ్లా ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు.

ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో ఎలా అయినా విజయం సాధించి, ఆసియా కప్ టోర్నీ ఫైనల్స్ రేసులో సజీవంగా ఉండాలని బంగ్లా జట్టు భావిస్తోంది. అయితే సూపర్ 4 రౌండ్‌లో తమ తొలి మ్యాచ్ ఆడుతోన్న లంక దీనిలో ఎలా అయినా గెలిచి అవకాశాలను ముందునుంచే కాపాడుకోవాలనే యోచనలో ఉంది.

బంగ్లా జట్టు..

తుది జట్లు:

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహిష్ తీక్షణ్, కసున్ రజిత, మతిషా పతిరాన.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): మహ్మద్ నయీమ్, మెహిదీ హసన్ మిరాజ్, లిటెన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), షమీమ్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్.

శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.