ఒక్క నిర్ణయంతో రోహిత్‌సేన కొంప మునిగినట్టే.. ఆ ముగ్గురిలో ఆడేది ఎవరు.?
ఆసియా కప్ 2023లో సూపర్ 4s రౌండ్ మొదలైంది. మరో హై-వోల్టేజ్ మ్యాచ్‌కు టీమిండియా సిద్దమైంది. ఆదివారం దాయాదులైన భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టిస్ చేస్తున్నారు. అయితే పాకిస్థాన్‌తో సూపర్ ఫోర్ మ్యాచ్‌కు ముందుగా..
ఆసియా కప్ 2023లో సూపర్ 4s రౌండ్ మొదలైంది. మరో హై-వోల్టేజ్ మ్యాచ్‌కు టీమిండియా సిద్దమైంది. ఆదివారం దాయాదులైన భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టిస్ చేస్తున్నారు. అయితే పాకిస్థాన్‌తో సూపర్ ఫోర్ మ్యాచ్‌కు ముందుగా టీమిండియా తలపట్టుకుంది. ముగ్గురు ఆటగాళ్లపై తుది నిర్ణయం తీసుకోవడంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సతమతమవుతున్నారు. ఇప్పటికే ప్రాక్టిస్ సెషన్‌లో కెఎల్ రాహుల్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్, కీపింగ్ చేసి.. పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
శుక్రవారం టీమిండియా తన మొదటి అవుట్‌డోర్ ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్‌లో కెఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో పాటు కీపింగ్ చేశాడు. టీం మేనేజ్‌మెంట్ మొత్తం అతడిపై దృష్టి సారించింది. ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల నుంచి దూరమైన తర్వాత.. సూపర్ ఫోర్ కీలక పోరుకు కెఎల్ రాహుల్ సిద్దమవుతున్నాడు.
భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాట్‌తో చెమటోడ్చిన కెఎల్ రాహుల్.. ఆ తర్వాత 45 నిమిషాల పాటు వికెట్ కీపింగ్ చేశాడు. వికెట్ కీపింగ్‌లో రాహుల్ తన సత్తాను చాటడంతో ఇప్పుడు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా మారుతుంది అనేది ఒక ప్రశ్న? మరి, రాహుల్‌కి అవకాశం వస్తే ఎవరి స్థానంలో? ఇషాన్‌ను రాహుల్ భర్తీ చేస్తాడా.? లేదా ఇద్దరూ కలిసి ఆడతారా.? ఇదే జరిగితే శ్రేయాస్ అయ్యర్ జట్టులో నుంచి ఔట్ అయినట్టే.?
ఇషాన్, రాహుల్ కలిసి ఆడితే..!
ఇషాన్, రాహుల్ ఇద్దరూ కలిసి ఆడే అవకాశం ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఇదే జరిగితే శ్రేయాస్ అయ్యర్ తుది జట్టు నుంచి వైదొలిగినట్టే. దీన్ని బట్టి టీమిండియాకు నష్టం జరిగినట్టే.
ఇషాన్ ఆడటం ఖాయం.!
ఇషాన్ కంటిన్యూగా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. వన్డేల్లో గత 4 ఇన్నింగ్స్‌ల్లో 50కిపైగా పరుగులు చేశాడు. ఇక అతిపెద్ద విషయం ఏంటంటే.. పల్లెకెలెలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు 5వ నంబర్‌లో ఆడిన ఇషాన్.. అజేయంగా 82 పరుగులు చేశాడు.
అయ్యర్ Vs రాహుల్ 4వ స్థానంలో?
మరోవైపు, టీమ్ ఇండియాకు కూడా నంబర్ 4 సమస్య ఉంది, దీనికి శ్రేయాస్ అయ్యర్ సరైన ఆప్షన్. అయ్యర్ 4వ స్థానంలో ఉన్నప్పుడు వన్డేల్లో 21 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో అతను 45.50 సగటుతో 819 పరుగులు చేశాడు. అయితే KL రాహుల్ టీం ఇండియా తరపున 4వ ర్యాంక్‌లో కేవలం 7 ODI ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు, అతడి సగటు 40.17.