IND vs PAK: రౌఫ్‌ ఓవరాక్షనే పాకిస్తాన్‌కి శాపమైందా..? ప్రత్యర్ధిపై రోహిత్ సేన మూకుమ్మడి దాడి అందుకేనా..? నెటిజన్ల రియాక్షనిదే..

IND vs PAK: పాక్ బౌలర్లకు భారత్ బ్యాటర్లు మెరుపులు చూపిస్తే.. ప్రత్యర్థి బ్యాటర్లకు మన బౌలర్లు చుక్కలు కనిపించేలా చేశారు. నేపాల్ వంటి పసికూనపై 151 పరుగులు చేసిన బాబర్ అజామ్ అయితే పార్ట్‌టైమ్ బౌలర్ అయిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో 10 పరుగులతోనే వెనుదిరిగాడు. ఓపెనర్ ఫఖార్ జమాన్ చేసిన 27 పరుగులే పాక్ బ్యాటర్లకు టాప్ స్కోర్ అంటేనే.. ఈ మ్యాచ్‌లో మన బౌలర్లు ఎలా ప్రత్యర్థికి చుక్కలు చూపారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్..

IND vs PAK: రౌఫ్‌ ఓవరాక్షనే పాకిస్తాన్‌కి శాపమైందా..? ప్రత్యర్ధిపై రోహిత్ సేన మూకుమ్మడి దాడి అందుకేనా..? నెటిజన్ల రియాక్షనిదే..
India Vs Pakistan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 12, 2023 | 11:04 AM

భారత్, పాక్ మధ్య సెప్టెంబర్ 2న జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ తీసిన పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. రౌఫ్ చేసిన ఓవరాక్షన్‌కి కింగ్ కోహ్లీ రియాక్షన్ చూపించాలని క్రికెట్ ప్రపంచమంతా కోరుకుంది. అయితే క్రికెట్ అభిమానుల కోరిక నేరవేర్చేందుకు విరాట్ కోహ్లీ మాత్రమే కాక రోహిత్ సేన మొత్తం మూకుమ్మడిగా పాకిస్తాన్ బౌలర్లు, బ్యాటర్లకు ఇచ్చిపడేసింది. బ్యాటింగ్ కోసం ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (56), శుభమాన్ గిల్ (58) అర్థసెంచరీలతో.. విరాట్ కోహ్లీ (122*), కేఎల్ రాహుల్ (111*) అజేయమైన సెంచరీలతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, ఫహీమ్ అశ్రఫ్, హరీస్ రవుఫ్, షబాద్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ వేసిన ఓవర్లలో పరుగుల వర్షం కాకుండా తుఫాన్ వచ్చేలా చేశారు. పాకిస్తాన్ వన్డేల్లో ఎప్పుడూ చేధించనంత టార్గెట్‌ను బాబర్ సేన ముందు ఉంచారు.

సెప్టెంబర్ 2న ఇషాన్(82) మెరుపులు

ఇవి కూడా చదవండి

హరీస్ రౌఫ్ ఓవరాక్షన్.. 

పాక్ బౌలర్లకు భారత్ బ్యాటర్లు మెరుపులు చూపిస్తే.. ప్రత్యర్థి బ్యాటర్లకు మన బౌలర్లు చుక్కలు కనిపించేలా చేశారు. నేపాల్ వంటి పసికూనపై 151 పరుగులు చేసిన బాబర్ అజామ్ అయితే పార్ట్‌టైమ్ బౌలర్ అయిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో 10 పరుగులతోనే వెనుదిరిగాడు. ఓపెనర్ ఫఖార్ జమాన్ చేసిన 27 పరుగులే పాక్ బ్యాటర్లకు టాప్ స్కోర్ అంటేనే.. ఈ మ్యాచ్‌లో మన బౌలర్లు ఎలా ప్రత్యర్థికి చుక్కలు చూపారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ (5 వికెట్లు) స్పిన్ మాయాజాలం ముందు పాకిస్తాన్ నిలవలేకపోయింది. దీంతో పాకిస్తాన్ 128 పరుగులకే పరిమితమై.. భారత్ చేతిలో 228 రన్న్ తేడాతో ఓడిపోయింది. సెప్టెంబర్ 2న హరీస్ రౌఫ్ చేసిన ఓవరాక్షన్‌కి బదులుగా రోహిత్ సేన యావత్ పాకిస్తాన్ జట్టుకు గుణపాఠం నేర్పిందని నెటిజన్లు మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. అలా వైరల్ అవుతున్న మీమ్స్‌లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..

మా ముందు కాదురో..

వాళ్ల వల్ల కాని పని..

చుక్కలు కనిపించాయా..?

సామ్రాట్ కోహ్లీ..

ఇలా ఉండాలి మరీ..

గాయంతో తప్పించుకున్నాడు..

బాగా లెక్కపెట్టండి..

ప్రత్యర్థి ఎవరైనా కింగ్ తగ్గడుగా..

తెలిసిందా..

నిలవలేవురా..

కింగ్ కోహ్లీ.. 

ఖర్మ ఫలితం.. 

‘విరాట్’ కోహ్లీ..

రియాక్షన్ ఇలా ఉంటది.. 

ఇదిలా ఉండగా.. భారత్ ప్లేయర్లను పాకిస్తాన్ ప్లేయర్లు ఇలా కవ్విస్తేనే అసలైన క్రికెట్ వినోదం అందుతుందని కొందరు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. పోనీ పాక్ ప్లేయర్లు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు అయినా చేస్తే.. భారత ప్లేయర్లకు వాటికి ఆట ద్వారా సమాధానం చెప్పే అవకాశం, అభిమానులకు వినోదం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.