AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: పొరపాటున కూడా ఇతరులకు చెప్పకూడని విషయాలు.. చెప్తే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..

Chanakya Niti: చాణక్యుడి ‘చాణక్య నీతి’లో వివరించిన ప్రతి అంశం జీవిత పాఠాలను నేర్పించేదిగానే ఉంటుంది. ఈ క్రమంలో చాణక్యుడు లేనిపోని సమస్యలకు దూరంగా ఉండేందుకు కొన్ని విషయాలను ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోకూడదని వివరించారు. కనీసం భార్యతో కూడా చెప్పవద్దని చెప్పాడు.  ఇంతకీ ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు పేర్కొన్న ఆ విషయాలు ఏంటి..?

Chanakya Niti: పొరపాటున కూడా ఇతరులకు చెప్పకూడని విషయాలు.. చెప్తే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..
Chanakya Niti
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 10, 2023 | 6:07 PM

Share

Chanakya Niti: మనిషి తన జీవితంలో ఎదురయ్య సమస్యలను ఎలా అధిగమించాలి..? ఇతరులతో ఎలా మెలగాలి..? వారితో సత్సంబంధాలను ఎలా పెంచుకోవాలి..? దాంపత్య జీవితంలో వివాదాలకు ఎలా స్వస్తి  పలకాలనే విషయాలపై ఆచార్య చాణక్యుడు తన మేధస్సుతో చక్కని సలహాలను అందించాడు. స్వతహాగానే ఎన్నో శాస్త్రాల్లో పండితుడైన చాణక్యుడి సూచనలను పాటిస్తే చింతలన్నీ తొలగి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని అనేక మంది పెద్దలు కూడా చెబుతుంటారు. చాణక్యుడి ‘చాణక్య నీతి’లో వివరించిన ప్రతి అంశం జీవిత పాఠాలను నేర్పించేదిగానే ఉంటుంది. ఈ క్రమంలో చాణక్యుడు లేనిపోని సమస్యలకు దూరంగా ఉండేందుకు కొన్ని విషయాలను ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోకూడదని వివరించారు. కనీసం భార్యతో కూడా చెప్పవద్దని చెప్పాడు.  ఇంతకీ ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు పేర్కొన్న ఆ విషయాలు ఏంటి..? చెప్తే కలిగే సమస్యలు ఏంటి..? తెలుసుకుందాం..

సంపాదన: మనిషి తన సంపాదన గురించి ఇతరులతో చెప్పకుండా ఉండడమే ఎంతో మంచిదని, చెప్పాల్సిన అవసరం వస్తే కుటుంబంతో మాత్రమే పంచుకోవాలని చాణక్యుడు సూచించాడు. సంపాదన గురించి ఇతరులతో చెప్పడం వల్ల వారి చెడు దృష్టి మీ ఆదాయంపై పడి అర్థిక నష్టాలకు దారి తీస్తుందని ఆచార్య చాణక్య హెచ్చరించాడు.

బలహీనతలు: వ్యక్తి తనలోని లోపాలు, బలహీనతల గురించి ఇతరులకు చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మనలోని లోపాలు ఇతరులకు తెలియడం వల్ల వాటిని ఆసరాగా తీసుకునే మనల్ని ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని, విజయ సాధనలో అతి ఆటంకంగా మారుతుందని చాణక్యుడు సూచించాడు.

ఇవి కూడా చదవండి

దానధర్మాలు: దానధర్మాల గురించి కూడా ఇతరులకు చెప్పకూడదని, చెప్తే పుణ్యం దక్కదని చాణక్యుడు పేర్కొన్నాడు. దానం పుణ్య కార్యమని, దాని గురించి ఇతరులకు చెప్పడం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఉండదని తెలిపాడు.

దాంపత్య రహస్యాలు: మనిషి తన వైవాహిక జీవితానికి సంబంధించిన వివరాలను కూడా ఇతరులతో పంచుకోకూడదు. దాంపత్య జీవితం గోప్యంగా ఉంటేనే భార్యభర్తలకు మంచిది. లేకుంటే ఇతరుల నుంచి అనుకోని సమస్యలు తప్పవని ఆచార్య చాణక్యుడు సూచించాడు.

Note: ఇక్కడ తెలిపిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధార పడి ఉంటుంది. ఈ సమాచారాన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..