SL vs BAN: ప్రత్యర్థి బౌలర్లపై విజృంభించ సమర విక్రమ.. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం.. చేధించకుంటే ఇంటికే..
Asia Cup 2023: లంక తరఫున లంక తరఫున సమర విక్రమ బంగ్లా బౌలర్లపై చెలరేగాడు. 72 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 93 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసుకోవడానికి మరో 7 పరుగులు కావాలన్నప్పుడు తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అంతక ముందు శ్రీలంక జట్టుకు బ్యాటింగ్ ఓపెనర్లుగా వచ్చిన పతుమ్ నిసాంక పర్వాలేదనిపించినా..
Asia Cup 2023: ఆసియా కప్ టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో భాగంగా జరుగుతోన్న రెండో మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హాసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో దసున షనక నేతృత్వంలోని లంక తొలి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో లంక తరఫున లంక తరఫున సమర విక్రమ బంగ్లా బౌలర్లపై చెలరేగాడు. 72 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 93 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసుకోవడానికి మరో 7 పరుగులు కావాలన్నప్పుడు తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అంతక ముందు శ్రీలంక జట్టుకు బ్యాటింగ్ ఓపెనర్లుగా వచ్చిన పతుమ్ నిసాంక (40) పర్వాలేదనిపించినా.. అతనితో పాటు వచ్చిన దిముత్ కరునరత్నే (10) శుభారంభం అందించలేకపోయాడు.
విక్రమ సమరం
Sadeera Samarawickrama scored a stunning 93-run knock, setting a new personal best in ODI cricket!#AsiaCup2023 #SLvBAN #LankanLions pic.twitter.com/qqSNBfhX22
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 9, 2023
కుశల్ మెండీస్ అర్థశతకం..
Kusal Mendis🔥Back-to-back fifties!#AsiaCup2023 #SLvBAN #LankanLions pic.twitter.com/PlfZJSqgIl
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 9, 2023
ఆపై మూడో నంబర్లో వచ్చిన లంక వికెట్ కీపర్- బ్యాట్స్‌మ్యాన్ కుశల్ మెండీస్ (50) అర్థ సెంచరీతో వెనుదిరిగాడు. 4వ నంబర్‌లో బ్యాటింక్ చేసిన సమర విక్రమ 93 పరుగులు చేయగా.. అతని తర్వాత వచ్చినవారు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. చివర్లో దసున్ సనక (24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, హాసన్ మహ్ముద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇలా లంక బ్యాటర్లు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ మహ్మద్, హాసన్ మహ్ముద్ చెరో 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టాడు.
బంగ్లా టార్గెట్..
Samarawickrama’s scintillating 93-run knock has propelled Sri Lanka to a total of 257 runs! The pitch is proving to be two-paced, offering significant assistance to spinners.
Can the Tigers successfully chase down this total? #AsiaCup2023 #SLvBAN pic.twitter.com/OypgNVEL4O
— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2023
మరోవైపు లంక ఇచ్చిన 258 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బంగ్లాదేశ్ తన బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను మరి కొన్ని నిముషాల్లో ప్రారంభించనుంది. సూపర్ 4 రౌండ్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 7 వికెట్లు తేడాతో ఓడిన బంగ్లా టోర్నీలో నిలవాలంటే.. నేటి మ్యాచ్‌లో ఎలా అయినా గెలవాల్సి ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్‌లో బంగ్లా గెలవకపోతే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..